రాజకీయాల్లోకి వచ్చేసా.. త్వరలో పార్టీ ప్రకటిస్తా : కమల్ హాసన్

Vasishta

రాజకీయ అరంగ్రేటంపై తమిళనటుడు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చాడు..ఆల్ రెడీ పాలిటిక్స్ లో అడుగు పెట్టేశానని..చెప్పాడు. తనపై వస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేశాడు కమల్. తాను కూడా హిందువేని అని, హిందువుల సెంటిమెంట్‌ను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. 63వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అభిమానులతో సమావేశమైన కమల్ పలు అంశాలపై ప్రసంగించారు. ఇవాళ కొత్త పార్టీని ప్రకటిస్తాడనుకున్నప్పటికీ అలాంటిదేమి చేయలేదు. కేవలం ఒక యాప్ ను మాత్రం ప్రారంభించాడు కమల్..


తమిళ సూపర్ స్టార్ కమల్‌హాసన్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నాడు. ఇవాళ కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతా అనుకున్నప్పటికీ అలాంటిదేమీ చేయలేదు. కేవలం ఓ యాప్‌ను మాత్రం ప్రారంభించాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఈ యాప్ ద్వారా తన అభిమానులు దానిని వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం కోసం పోరాడాలని కమల్ పిలుపునిచ్చాడు. పార్టీ నిర్మాణం, కార్యకలాపాల కోసం అభిమానుల నుంచే విరాళాలు సేకరిస్తానని, ఆ వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయని కమల్ ప్రకటించాడు.


తన రాజకీయ ఎంట్రీపై ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నాడు కమల్ హాసన్, పార్టీ ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పాడు. తమిళనాడు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ‘మయ్యం విజిల్’ యాప్ ను విడుదల చేశానన్నారు. త్వరలోనే రాష్ట్రం మొత్తం పర్యటించనున్నట్లు తెలిపాడు కమల్. హిందువులపై తనకు వ్యతిరేక భావనేమీ లేదని కమల్ హాసన్ పేర్కొన్నారు. తాను కూడా హిందువేనని..తనపై నాస్తికుడనే ముద్ర పడటం ఇష్టం లేదన్నాడు. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని తాను వాడలేదని..కేవలం అతివాదం అనే పదాన్ని మాత్రమే వాడనని వివరణ ఇచ్చాడు కమల్.


రాజకీయ పార్టీని ప్రారంభించనప్పటికీ తాను ఏం చేయాలనుకుంటున్నాడో కమల్ చెప్పనే చెప్పాడు. ఇక తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించద్దని అభిమానులకు పిలుపునిచ్చిన కమల్..తానెక్కడ వేడుకల్లో పాల్గొనలేదు. అవినీతి పాలనను ఎండగట్టడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని..తనకు ప్రజల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మొత్తం మీద మరి కొద్ది రోజుల్లో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు కమల్ ప్రకటించనే ప్రకటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: