భారత్ లో ఉగ్రవాదానికి ఊతమిచ్చే చైనాకు దాని దెబ్బేంటో తెలుస్తుందిప్పుడు

ఉగ్రవాదం విషయంలో భారత్‌కు ఏమాత్రం సహకరించని చైనాకు టెర్రరిజం దెబ్బేంటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పాకిస్తాన్ చైనాల్లో ఒకరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మరొకరు దానికి వత్తాసుపలుకుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలను ఐఖ్య రాజ్య సమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్థాన్ ను ఇప్పటికే ఉగ్రవాద దేశంగా అమెరికా గుర్తించింది. ఇంకా అనేక దేశాలు అమెరికా దారిలో నడుస్తున్నాయి. 


పాకిస్థాన్‌లోని తమ రాయబారి ప్రాణాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని డ్రాగన్ దేశం నెత్తి నోరు బాదుకుంటుంటూ, "వాడు పాక్ వచ్చేశాడు, మా వాణ్ని చంపేస్తాడు" అంటూ చైనా వాపోతోంది. అఫ్ఘనిస్థాన్‌లో చైనా రాయబారిగా పనిచేసిన 'యావో జింగ్‌' అక్టోబర్‌ 19న పాక్‌లో చైనీస్‌ రాయబారిగా నియమితులయ్యారు. మొన్ననే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఆయనను అంతం చేసేందుకు ఉగ్రవాదులు స్కెచ్‌ వేశారు  తమ రాయబారి  'యావో జింగ్' ప్రాణాలకు ఉగ్రవాదుల నుండి ముప్పు ఉందని చైనా చెబుతోంది. ఇస్లామాబాద్‌లో ఇటీవలే బాధ్యత లు స్వీకరించిన 'యావో జింగ్‌' కు భద్రత పెంచాలని పాక్ ప్రభుత్వాన్ని కోరు తోంది చైనా. ఈ మేరకు చైనీస్ ఎంబసీ పాక్ మంత్రికి లేఖ కూడా రాసింది. తానేంతో శక్తివంతమైన దాన్నని వెయ్యేళ్ల భవిష్యత్ ఆవల దృష్ఠి సారించగలమనే చైనా నేడిలా తన సామంత దేశం పాకిస్థాన్ ను బ్రతిమాలుకుంటుంది. 



‘‘ఇప్పటికే అతను పాకిస్థాన్‌లోకి ఎంటరయ్యాడు. పేరు.. అబ్దుల్‌ వలీ. అతని పాస్‌పోర్ట్‌, వీసా డిటెయిట్స్‌ పంపిస్తున్నాం. గుర్తుంచుకోండి.. అతనికి కావాల్సింది చైనా రాయబారి ప్రాణాలు! ఒకవేళ అతను అనుకున్నది జరిగితే, మన రెండు దేశాలకీ ఎంత నష్టమో మీకు తెలుసు. ప్రతిష్ఠ మంట గలిసిపోవటం ఖాయం. కాబట్టి జాగ్రత్త వహించండి. తక్షణమే మా రాయబారికి తగినంత భద్రత ఏర్పాటు చేయండి.’’...... ఇదీ..ప్రతిష్టాత్మక చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపెక్‌) ముఖ్యఅధికారి పింగ్‌ యింగ్‌ ఫీ,  పాకిస్తాన్‌ అంతర్గత శాఖ మంత్రికి రాసిన లేఖ. కొద్ది గంటల కిందటే వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం పాక్‌లో సంచలనంగా మారింది.


"ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ - (ఈటీఐఎం)" అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు తమ రాయబారిని చంపేందుకు పాకిస్థాన్‌లో చొరబడ్డారని చైనా చెబుతోంది. తమ రాయబారికి భద్రతను మరింతగా పెంచాలని పాక్ ప్రభుత్వానికి విన్నవించుకుంది.




అప్ఘానిస్థాన్‌లో రాయబారిగా పని చేసిన 'యావో జింగ్‌' ను ఇటీవలే చైనా పాకిస్థాన్‌ లో రాయబారిగా నియమించింది. సన్ విడాంగ్ స్థానంలో చైనా రాయబారి గా ఆయన ఈ మద్యనే బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని చంపడానికే ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారట. పాక్ మంత్రికి రాసినలేఖలో సదరు ఉగ్రవాది పాస్‌పోర్ట్ వివరాలను కూడా తెలియజేశారు.'అబ్దుల్ వలీ'అనే ఆ ఉగ్రవాదిని వెంటనే అరెస్ట్ చేసి, తమ ఎంబసీకి అప్పగించాలని చైనా డిమాండ్ చేస్తోంది. చైనాలోని ముస్లిం ప్రజలు అధికంగా నివసించే 'జిన్‌జాయాంగ్' ప్రాంతంలో "ఈటీఐఎం" ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. 


ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో అంతుచిక్కకుండా తిరుగుతోన్న అబ్దుల్‌ వలీ చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో 'ఉయ్‌ఘర్‌' తెగకు చెందిన ముస్లింలు అధికంగా నివసిస్తూఉంటారు. అబ్దుల్‌ వలీ ఆ తెగకు చెందినవాడే. ఉయ్‌ఘర్‌ ముస్లింలు.. తాము చైనాలో కలిసి ఉండబోమని, ప్రత్యేక దేశం కావాలని  "ఈస్ట్‌ టర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌"  పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. వారికి టర్కీ, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిరిజిస్థాన్‌, పాకిస్థాన్‌, ఆప్ఘానిస్థాన్‌లో ఉండే "ఉయ్‌ఘర్‌ ముస్లిం" ల మద్దతు కూడా ఉంది.



uyghur muslim race 


హఫీజ్ మహమ్మద్ సయీద్,  మసూద్ అజహర్ అనే ఉగ్రవాదులు, భారత్ లో అనేక కిరాతక ఉగ్రవాద దాడులకు కెంద్ర బిందువులు అయ్యారు. ఐఖ్యరాజ్యసమితి అతణ్ణి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటూ వస్తుంది.
ఆ పాపం-చైనాకే కాలసర్పంలా చుట్టుకుంటూవచ్చి వారికీ అబ్దుల్ వలి రూపంలో మరో హఫీజ్ సయీద్ అయ్యాడు.  తనదాకా వస్తే కాని తెలియదంటారు. ఇప్పుడు చైనా ఏంచేస్తుంది? అనేదే ప్రశ్న. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: