2019 గెలుపు లక్ష్యంగా..బీజేపీ సీఎంలతో మోడీ, షా భేటీ..!

Edari Rama Krishna
నేడు బీజేపీ పాలిత రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా  సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 13 రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ లోని కొందరు కీలకమంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్వార్టర్లీ మీట్ కోసం ఈ సమావేవం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అంతే కాదు  2019 ఎన్నికల్లో 350కు పైగా స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు.  రాష్ర్టాల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల సీఎంలకు మోదీ, షా సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక ఆయా  రాష్ట్రాల్లో  ప్రభుత్వ పథకాలను మోదీకి ముఖ్యమంత్రులు వివరించే అవకాశం ఉంది.  

ప్రధాని మోడీ హాజరయ్యే ఈ సమావేశానికి కేంద్ర అభివృద్ధి, సంక్షేమ, సాంఘిక పథకాలపై చర్చించనున్నారు.  ముఖ్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల అమలు ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉందో తెలుసుకోనున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరైనట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: