రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ..రక్తంతో స్నానం చేస్తాడట..!

Edari Rama Krishna
రష్యా అధ్యక్షుడు పుతిన్  కి సంబంధించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా కొన్ని పక్షులు, జంతువుల రక్తం సేవించినా, వాటి రక్తం శరీరానికి పూసుకున్నా..స్నానం చేసినా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని అంటారు.  తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేస్తాడట.

అంతే  కాకుండా తన లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ఆయన దుప్పి (రాయల్ స్టాగ్) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారంటూ సంచలన విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. రాయల్‌ స్టాగ్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో చాలా రకాల శారీరక సమస్యలు నయమవుతాయని అక్కడి వారి నమ్మకం.

రష్యాలో ఈ రక్తంతో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది.  పుతిన్ తన స్నానానికి గాను గత ఏడాది 70 కిలోల దుప్పి కొమ్ములను సేకరించారని పేర్కొంది. కాగా, రష్యా దేశంలో ఔషధపరంగా దుప్పి కొమ్ములకు చాలా ప్రాధాన్యమిస్తారు.  ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తారని, మరికొందరు దీనిని సేవిస్తారని సమాచారం. దుప్పి కొమ్ముల రక్తం పది మిల్లీ లీటర్ల ఖరీదు వంద డాలర్లు విలువ చేస్తుందని సమాచారం. ఈ విషయాలను స్థానిక పత్రిక ‘రిపబ్లిక్‌’ వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: