ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, ఏ-1 నిందితుడు శ్రవణ్ - ఇద్దరూ ఇద్దరే


నాలుగు స్థంబాలాట లో  ఒకరి అవసరం  మరొకరికి అవకాశంగా మారింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో ఇద్దరిని జైలుకు పంపింది. ఒక పన్నెండేళ్ళ అమ్మాయి అమ్మ లేనిదైంది. ఒక పచ్చని కుటుంబమే విచ్చిన్నమైంది. బ్యుటీషియన్‌ శిరీష కేసులో ప్రధాన నిందితుడు (ఏ-1) శ్రవణ్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చే పంచాయతీల్లో చేయి తిరిగిన బ్రోకర్‌ అని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రవణ్‌ విద్యార్ధి దశ నుంచే పోలీసులతో స్నేహసంబంధాలు పెంచుకున్నాడు.


ఎవరి అవసరం ఏమిటి?

ఎవరితో ఎలా పని చేయించుకోవాలి?

ప్రతిఫలంగా ఏమివ్వాలన్న విషయాలను బాగా ఒంట బట్టించుకున్నాడు.

 

శిరీష కేసులో శ్రవణ్‌ను రెండో సారి గట్టిగా విచారించినప్పుడు అతనికి, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. శిరీష వ్యక్తిత్వం, రాజీవ్‌తో ఉన్న సంబంధాల గురించి వివరాలు వెల్లడించిన పోలీసులు, కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, శ్రవణ్‌ల మధ్య ఉన్న కీలకమైన అనుభందం గురించి మాట్లాడలేదు.


“శిరీషకు రాజీవ్‌” తో శారీరక  సంబంధాలున్నాయని మీడియాకు బాహాటంగా చెప్పి, ఎస్‌ఐ, శ్రవణ్‌ల మధ్య ఉన్న నేరపూరిత సాన్నిహిత్యాన్ని  బహిరంగంగా కాకుండా కోర్టుకు అందజేసిన రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. రిమాండ్‌ డైరీలో పేర్కొన్న అంశాలు, విశ్వసనీయ పోలీసు అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం,  శిరీష- రాజీవ్‌ల బంధం కంటే, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్‌కు ఉన్న అనుబంధమే ధృఢమైనది గట్టిది, సుదీర్ఘమైనది.  


ప్రభాకర్‌రెడ్డి కానిస్టేబుల్‌గా ఉన్నప్పటి నుంచే శ్రవణ్‌కు పరిచయం ఉంది. అప్పటి నుంచే అతనితో శ్రవణ్‌ పనులు చేయించుకునే వాడు. ప్రతిఫలంగా ప్రభాకర్‌రెడ్డి కోరుకున్నవి ఏర్పాటు చేసేవాడు. తను ఎస్‌ఐ అయిన తర్వాత పెద్ద పనులు చేయించుకున్నాడు. అమ్మాయిలను ఎరవేసి ప్రభాకర్‌రెడ్డినితన గుప్పిట పట్టుకున్నాడు. గత ఏడాదికాలంలో శ్రవణ్‌ మూడు సార్లు ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి వద్దకు అమ్మాయిలను పంపించినట్లు విచారణలో వెలుగుచూసింది. శ్రవణ్‌కు 8 మంది పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలున్నాయి.


ఎవరి అవసరాన్ని బట్టి సహకరించి అవసరాలను తీర్చి సంతృప్తిగా సెటిల్‌ చేసేవాడు. "రాజీవ్‌, శిరీష" ల గురించి శ్రవణ్‌కు ముందే తెలుసు. తేజస్విని ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే శిరీష ఈ విషయమై శ్రవణ్‌ ముందు బయటపడింది. పోలీసు కేసు నమోదైతే తన మర్యాద మంటగలుస్తుందని, అన్యాయంగా తనపై ఫిర్యాదుచేశారని శ్రవణ్‌ వద్ద వాపోయింది. సాయం చేయాలని అభ్యర్థించింది.


అప్పుడు శ్రవణ్‌, హైదరాబాద్ పోలీస్ తో ఏ సంబందం లేని కుకునూరుపల్లి ఎసై  ప్రభాకర్‌రెడ్డి పేరు చెప్పాడు. ఎస్‌ఐ అన్నీ చూసుకుంటాడని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి  నమ్మ బలికాడు.  బంజారాహిల్స్ మాదాపూర్ పోలీసులు పరిష్కరించా ల్సిన కేసును అనధికారికం గా కుకునూరుపల్లికి మళ్ళించటంలో ఆయన కృత కృత్యుడవటానికి కారణం శ్రవణ్, శిరీషను అంతలా నమ్మించగలగటమే. "నమ్మినపుడే చేసేది కదా! నమ్మకద్రోహం"


తాను పోలీస్ ఎసై కావటానికి దగ్గరి మార్గాలు చూపించి అప్పుడప్పుడు పోలీస్లతో పనిబడ్డప్పుడు అతి సునాయాసంగా చేసిపెట్టే ఎసై  ప్రభాకర్‌రెడ్డికి మరపురాని బహుమతి ని ఇచ్చేందుకు ఇచ్చే ప్లాను-ప్రణాళికను సిద్ధంచేసి ఒక అసహాయ అవసరాన్ని తనకు అవకాశంగా మలుచుకున్నాడని సామాన్య విషయపరిజ్ఞానం ఉన్న వారెవరికైనా అర్ధమౌతుంది.    


అతని  కడుపులో ఇంత విషపూరిత  ఉద్దేశం ఉంది. శిరీష గురించి ఎస్‌ఐకి ఫోన్‌చేసి సమస్యను వివరించాడు. ఈ కేసులో సాయపడితే శిరీష పనికొస్తుందని తనను రంజిప చేయగలదనే లెవెల్లో ఆమెను ఫోకస్ చేశాడు శ్రవణ్ చెప్పాడు. శిరీషకు బ్యుటీషియన్‌, మేకప్‌ రంగాల్లో తెలిసిన వారు చాలామంది ఉన్నారని ఎస్‌ఐకి కొత్త కోణం చూపించాడు.  


తన సెల్‌ ఫోన్లో శిరీష ఫొటోలు పంపించాడు. ఫొటోల్లో కన్నా బయట ఇంకా అందంగా ఉంటుందని తన వాట్పప్‌ సందేశాల్లో పేర్కొన్నాడు. దీంతో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఈ కేసులో జోక్యం చేసుకొన్నాడు. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌ఐ హరీందర్‌కు ఫోన్‌ చేశాడు. తేజస్విని పెట్టిన కేసులో శిరీష, రాజీవ్‌లు తనకు కావాల్సిన వాళ్లని, సాయం చేయాలని కోరాడు. ఆ రోజు కేసు తేలలేదు. మరో వారం తర్వాత రావాలని బంజారాహిల్స్‌ పీఎస్‌ ఎస్‌ఐ రమ్మన్నారు.


దాంతో శిరీష తీవ్ర ఆందోళనకు గురైంది. కేసు వెంటనే పరిష్కారం కావాలని, తేజస్విని కేసును వెనక్కు తీసుకునేలా చూడాలని శ్రవణ్‌ను కోరింది. కేసు వెంటనే క్లియర్‌ కావాలంటే కుకునూరుపల్లి ఎస్‌ఐని కలవడమే మార్గమని శ్రవణ్‌ నమ్మబలికాడు. ఎస్‌ఐతో తన ఫోన్‌ ద్వారా మాట్లాడించాడు. ‘‘సార్‌!  నాకు సాయం చేయండి. ప్లీజ్‌’’ అంటూ శిరీష బేలగా  ఎస్‌ఐని అభ్యర్థించింది. దీనికి ఎస్‌ఐ  ‘‘ఒకే. ఒకే. సెటిల్‌  అవుద్ది. వర్రీ కాకండి. టెన్షన్‌ పడకండి, మై హూ నా!"  అనేలా బదులిచ్చాడు. 


శిరీష చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని,  నీకు చాలా బాగా  పనికొస్తుందని శ్రవణ్‌ చెప్పడంతో ఎస్‌ఐ ఎలాంటి జంకు లేకుండా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. రాజీవ్‌ను బయటకు తీసుకెళ్తూ శ్రవణ్‌ కనుసైగ చేయడంతోనే ఎస్‌ఐ తలుపులు వేసి శిరీషపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దాంతో ఆమె ప్రతిఘటిస్తూ ఏడుస్తుండ టంతో రాజీవ్‌తో పాటు లోనికి వచ్చిన శ్రవణ్‌ ఆమెపై దాడి చేశాడు. రాజీవ్‌ కూడా ఆమె కేకలను కట్టడి చేసేందుకు గట్టిగా కొట్టాడు. ఎంతకీ రోదన ఆగకపోవడంతో తమ లీలలు  సమాజానికి తెలుస్తుందనే భయంతో తక్షణమే  ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ ఎస్‌ఐ వారిని బయటకు పంపేశాడు.


తర్వాత వారు హైదరాబాద్‌కు వస్తుండగా మార్గంమధ్యలోనూ శిరీషపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో శ్రవణ్‌, ఎస్‌ఐ  ప్రభాకర్‌రెడ్డిల ఆలోచన గురించి రాజీవ్‌కు తెలియదని పోలీసులు చెబుతున్నారు. శిరీష ఆత్మహత్య అనంతరం కేసును పక్కదారి పట్టించేందుకు, కుకునూరుపల్లి కోణం వెలుగు చూడకుండా శ్రవణ్‌ శతవిధాలా ప్రయత్నించాడని రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. కాని  పరువుకు ప్రతిష్ఠకు బయపడ్డ ఎస్ ఐ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 


శ్రవణ్‌ సెల్‌ఫోన్‌ సందే శాలను పరిశీలించిన తర్వాతే విషయం తెలిసింది. ఇప్పుడీ కేసులో శ్రవణ్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, ఫోటోలే కీలక సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించారు. కాగా, శిరీష మృతి కేసులో నిందితులు శ్రవణ్‌, రాజీవ్‌ను నాంపల్లి మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ శనివారం 14రోజుల రిమాండ్‌ విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: