భారత్ వరుణాస్త్రంతో "పాక్ ఖేల్ ఖతం"

భారత్ సహనం పాక్ కు చేతకాని తనం లాగా కనిపించింది. అందుకే వేకువవేళ భారత యూరీ సెక్టరులో నిద్రలో ఉన్న సైనికుల పై ఉగ్రవాదులు దొంగ దాడి చేశారు. సరిహద్దులలో కంచెను కత్తిరించి దొంగతనం గా సైనిక స్థావరాలలోకి చేరి చేసిన నీతిబాహ్య చర్య కు 20 మంది భారత సైనికులు హతమయ్యారు. ఇక మనం పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాల్సిందే. కాని యుద్ధం మొదలవ్వ కుండానే భారత్ పాకిస్తాన్ పని ఖతం చేయబోతుంది.




ఏ అణ్వస్త్రాలనూ ప్రయోగించకుండానే కేవలం వరుణాస్త్రం (జలాస్త్రం) ప్రయోగించడం ద్వారా పాకిస్థాన్‌ ను ఎడారిలా మార్చే మార్గాలను అన్వేషిస్తుంది. 56 ఏళ్ల క్రితం, అంటే  1960 లో పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నరేందే మోదీ సర్కారు రద్దు చేసుకోనుంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్థాన్‌కు నీటిని ఇంతగా వినియోగించుకొనే అవకాశం ఉండదు. ఖచ్చితంగా పాకిస్థాన్ ఎడారిలా మారిపోతుంది.



సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం "బియాస్, రావి, సట్లేజ్"  మూడు నదులపై భారత్‌ కు హక్కులున్నాయి. జమ్ము కాశ్మీర్‌నుంచి ప్రవహించే సింధు, "చినాబ్, జీలం"  రెండు నదులపై పాకిస్థాన్‌ కు కంట్రోల్ ఉంటుంది. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే పాకిస్థాన్ దారిలోకి వస్తుందని మోదీ సర్కారు భావిస్తోంది.


జమ్ముకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో ఉన్న ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి ఊతమిచ్చినంత కాలం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందేనని భారత్ దృఢ సంకల్పంతో ఉంది. బుల్లెట్ పేల్చ కుండానే, ఎలాంటి రక్తపాతం లేకుండానే పాకిస్థాన్ పని ఖతం అయిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ పతనానికి నాంది ప్రస్థావన దీనితో జరిగుతుందన్నట్లే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: