పుష్కర స్నానం చేసిన పాప ఫోటోల్లో మూడు చేతులు..అందరూ షాక్..!

Edari Rama Krishna
మన చుట్టూ కొన్ని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అది అసలు కలా నిజమా అన్న స్థితిలో ఉండిపోతాం. కొన్ని చోట్ల ఒకే కాన్పులు ఆరుగురు పిల్లలు పుట్టారని మరో చోట ఒకే  కాన్పులో ఏకంగా  11 మందికి జ‌న్మ‌నిచింది.. ఈ సంఘటన అరబ్ ఎమిరేట్స్ లో చోటు చేసుకుంది. సూమారుగా 20 మంది వైద్యులు ఆపరేషన్ చేసి 11 మందినీ సురక్షితంగా బయటకు తీశారు..ఇలాంటి వార్తలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొంత మంది పిల్లలకు రెండు తలలు నాలుగు చేతులు ఇలా వింత ఆకారలతో పుట్టి వారిని చూస్తుంటూ ఆశ్చర్యం వేస్తుంది.

అయితే కొన్ని అనుకోకుండా ఫోటో గ్రఫికి దొరుకుతుంటాయి..అలాంటి వాటిలో కొన్ని నిజాలు ఉన్నా కొన్ని అభూత కల్పనలు ఉంటాయి. ఈ నెల 12న ప్రారంభం అయిన కృష్ణా పుష్కరాలు ఎంతో వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయం తెలిసిందే..తాజాగా మహబూబ్ నగర్ లోని సోమశిల పుష్కర ఘాట్ లో చివరి రోజు పుణ్య స్నానాల సందర్భంగా ఓ వింత జరిగింది. ఈ సందర్బంగా ఓ పాపకు తన తండ్రి స్నానం చేయిస్తున్నాడు..ఆ సమయంలో తన బంధువులు ఫోటోలు తీస్తున్నారు. వాటిల్లో ఒకదానిలో పాపకు మూడు చేతులు ఉన్నట్టు కనిపిస్తోంది.

కృష్ణయ్య అనే యాత్రికుడు తన కుమార్తె, 11 నెలల ప్రయోగకు స్నానం చేయిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ వింత చిత్రాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా కృష్ణమ్మ మహాత్మ్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: