మహారాష్ట్ర తో కేసీఆర్ ఒప్పందంలో ఆయనదే కీలక పాత్రా...?

Shyam Rao

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు అనంతఃరం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. గోదవారి జలాలను తెలంగాణ జిల్లాలకు తరలించడంలో కేసీఆర్ కేచీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కనీ వినీ ఎరుగని రీతిలో చారిత్రక ఒప్పందం కుదిరింది.


అయితే ఈ ఒప్పందం ఏ విధంగా సాధ్యం అయింది. ఈ ఒప్పందం వెనకాల కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు...? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని వదలకుండా కొన్ని సంవత్సరాలు పార్టీకోసం కృషి చేసిన వ్యక్తులకు కీలక పదవులను కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం. అందులో భాగంగానే కొందరు సీనియర్ నాయకులకు గవర్నర్ పదవులను సైతం కట్టబెట్టింది. బీజేపీ పార్టీలో తెలుగు ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాక కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం.


ఈయన, కేసీఆర్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడంతో వారిద్దరికీ మొదటి నుంచి పరిచయం ఉండేది. అదే పరిచయాన్ని ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకోవడానికి రాజకీయకంగా ఉపయోగించడానికి సిద్ధ మయ్యారు కేసీఆర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో గోదావారీ జలాల తరలింపు వెనకాల కీలక హస్తం గవర్నర్ విద్యాసాగర్ రావుదే. ఆయన సహకారంతోనే కేసీఆర్ ఇంత పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నదుల్లో కెల్లా పెద్దది, ఎక్కువ దూరం ప్రవహించే నది గోదావరి. అయితే గోదావరి పుట్టే ప్రదేశం మాత్రం మహారాష్ట్ర లోనే ఉండటం వల్ల గోదావరి జలాలను తరలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించడం తో వీటన్నింటికీ చెక్ పెట్టడానికి రాజకీయ చతుర్వ్యుహాన్ని ఉపయోగించిన కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం తో కీలక ఒప్పందం కుదుర్చుకోవడంలో విజయం సాధించారు. ఏది ఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనతరం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి కేసీఆర్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: