భారత్‌పై భారీ భూకంపం విరుచుకుపడనుందా...?

Shyam Rao
ఇటీవల కాలంలో భారత్ లో చోటుచేసుకుంటున్న ఘననీయమైన వాతావరణ పరిణామాల వల్ల భారత్ కు పెను ముప్పే పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్ట పరిమాణం రోజురోజుకు పెరగడం, నదుల పరిణామాల్లో పెను మార్పులు చోటుచేసుకోవడం లాంటివి భారతకు త్వరలోనే పెను ముప్పును తెచ్చిపెట్టనున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఈ ముప్పు కూడా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వెంబడే పొంచివున్నట్టు సమాచారం.



బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూఅంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే.. బీభత్సం తప్పదని, రిక్టర్‌ స్కేల్‌పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూకంపం విరుచుకుపడుతుందని శాస్త్రవేత్త మైకెల్‌ స్టెక్లర్‌ తెలిపారు. 



భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్‌ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని, దీనివల్ల భారత్‌కు తీవ్ర ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భూప్రకంపనలు వస్తే... భారతలోని ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు నేలమట్టమవుతాయన్నారు. సుమారు 14 కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: