ఏపీ: సీఎం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా నిషేధం..?

Divya
ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. కాలక్షేపానికి చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో 16 ఏళ్ల లోపు పిల్లలు కూడా సోషల్ మీడియాని వినియోగిస్తూ ఉండడంతో ఇక మీదట అలా ఉపయోగించడానికి వీలు లేకుండా పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పైన క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీస్ శాఖకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు వినిపిస్తున్నాయి.


సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతీ పైన చాలా ప్రభావం చూపిస్తోందని ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన పరిస్థితి చాలా ఉందని తెలియజేశారు. చిన్నపిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత విషయంపైనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హాసనానికి పాల్పడే వారిని కచ్చితంగా శిక్షిస్తామంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. అవసరమనుకుంటే ఈ అంశం పైన ప్రత్యేకించి ఒక చట్టాన్ని కూడా తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ చాలా కీలకమైన పాత్ర వ్యవహరించాలని, పదహారేళ్లలో పిల్లలు సోషల్ మీడియా వినియోగం పైన ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు విద్యార్థులకు కూడా సోషల్ మీడియా ప్రమాదాల పైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలంటు తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని  నియంత్రించేందుకు  ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలిపారు సీఎం చంద్రబాబు. చట్టపరమైన అంశాలతో సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. దీంతో రాబోయే రోజుల్లో పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా నిషేధం ఉండబోతోంది. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు పైన అభినందనలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: