కలిసి నడుద్దాం.. బీజేపీ-టీడీపీ గేమ్... !
గత డిసెంబరులో జరిగిన వాజ్‌పేయి 101వ వర్థంతికి ముందు వారోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ వాజ్‌పేయి విగ్రహాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా అమరావతిలో తొలి విగ్రహంగా వాజ్ పేయి స్టాట్యూను ఆవిష్కరించారు. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సుపరిపాలన యాత్రల్లోనూ ఇరు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అప్పటి నుంచి బీజేపీ-టీడీపీ నేతల మధ్య సఖ్యత పెరు గుతూ వచ్చింది. వీరికి జనసేన నాయకులు కూడా తోడైన విషయం తెలిసిందే.
ఇక, తాజాగా మరో కీలక కార్యక్రమానికి టీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తున్నాయి. సీఎం చం ద్రబాబు, బీజేపీ రాష్ట్ర చీఫ్ పీవీఎన్ మాధవ్‌లు దీనిపై 40 నిమిషాల పాటు కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే వచ్చే వారం నుంచి రాష్ట్రంలో ఉమ్మడిగా గ్రామాలు, మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రారంభించాల ని నిర్ణయానికి వచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతోపా టు దీనిలోని కొన్ని నిబంధనలను కూడా మార్పు చేసింది.
ఈ క్రమంలో వీబీజీ-రామ్‌జీ(వికసిత్ భారత్ గ్యారెంటీ.. రూరల్ మిషన్ ఆజీవికా)ను తీసుకువచ్చింది. అ యితే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్డీయే పాలిత రాస్ట్రాల్లో మరింత ఎక్కువ గా దీనికి ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏపీలో చేపట్టే వీబీజీ-రామ్‌జీ ప్రచారాన్ని.. చేపట్టనున్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా కలిసి రావడంతోపాటు క్షేత్రస్థాయిలో బీజేపీతో కలిసి కార్యక్ర మాల్లో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య కలవిడి పెరుగుతుండడం గమనార్హం.