మరికొన్ని నెలల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం జరగబోతోంది.. ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం కసరత్తులు చేస్తున్నారు.. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దళపతి టీవీకే పార్టీ ద్వారా ప్రజల్లోకి రానున్నారు.. ఎలాగైనా విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్నారు.. అలాంటి ఈ తరుణంలో ఆయన అధికారంలోకి రావడం కోసం వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఈ టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ.. మతత్వానికి, లౌకికవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో కాంగ్రెస్, టీవీకే పార్టీ విధానాలు ఒకే విధంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు..
అంతేకాదు ఈ రెండు పార్టీలు సహజ భాగస్వామ్యులంటూ అన్నారు. అలాగే విజయ్ దళపతి, రాహుల్ గాంధీ ఇద్దరు మంచి స్నేహితులని తెలియజేశారు.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కొన్ని విషయాలపై అవగాహనకు రావలసిన అవసరం ఉందని వాటిపై చర్చలు కూడా జరుపుతామని తెలియజేశారు. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే టీవీకేతో చర్చలు జరపడానికి వెనకంజ వేస్తున్నట్టు తెలుస్తోందని అన్నారు..
ముఖ్యంగా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మైనారిటీ,బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు.. ఈ విధంగా ఫెలిక్స్ గెరాల్డ్ కాంగ్రెస్,టీవీకే మధ్య పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.. అంతేకాదు గత నెల 25వ తేదీన టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనడం ఆయన మాటలకు బలాన్ని చేకూర్చింది. ఇదిలా నడుస్తున్న సమయంలో టీవీకే పార్టీ ద్వారా మాకు వచ్చే ముప్పు ఏమి లేదని ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తూ వస్తోంది.. మరి చూడాలి టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని సక్సెస్ అవుతుందా.. ఒకవేళ అదే జరిగితే బిజెపి పని అయిపోయినట్టేనా అనేది ముందు ముందు తెలుస్తుంది.