2026: కొత్త సంవత్సరం కీలకమే..జగన్ నిర్ణయం తీసుకుంటారా..?
మెజారిటీ నియోజవర్గాలలో క్యాడర్ పెద్దగా కనిపించలేదు. ఇందుకు ముఖ్య కారణం నేతలను నియోజకవర్గాలకు మార్చడం వల్లే ఇలా జరిగిందనే విధంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్టానుసారంగా నియోజకవర్గాలకు నాయకులను బదిలీ చేయడంతో బదిలీ చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్కనేత కూడా గెలవలేకపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉన్నందువల్ల నియోజవర్గాలకు మార్చిన వారు క్యాడర్ ను కలుపుకోవడానికి కూడా పెద్దగా సమయం లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే 2026లో జగన్ ఈయేడాది నియోజకవర్గాల ఇన్చార్జిల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది జగన్ మీద ఉన్న కేసులు విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనే విధంగా వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండడంతో పాటుగా ఎన్నికల ముందు నుంచి నియోజకవర్గాలలో ఇన్చార్జిలను నియమిస్తే.. ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ అటు క్యాడర్లో ఇటు ప్రజలలో మమేకం అవ్వడం వల్ల నేతల పేర్లు బలంగా వినిపిస్తాయి దీనివల్ల నియోజవర్గాలలో మరింత ఓటు శాతం పెరుగుతుంది.. అందుకే కచ్చితంగా ఈ ఏడాది ఇన్చార్జిలను నియమించాల్సి ఉంటుంది. కూటమి పైన అసంతృప్తి ఉండే ఓటర్లను సైతం తమ వైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం పైన జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.