భూమ విషయంపై.. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన TTD..!
అసలు విషయంలోకి వెళ్తే.. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు సంబంధించి తిరుమలలో కొత్త గెస్ట్ హౌస్లను నిర్మించడానికి భూమిని కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ టిటిడి ని కోరారు. అయితే వారి అభ్యర్థులను తీసుకున్నప్పటికీ టీటీడీ పాలకమండలి వాటిని తిరస్కరించింది. తిరుమల కొండ పైన కొత్త నిర్మాణాలపై నిషేధం విధించడమే కాకుండా, భూమి కొరత ఉండటం వల్ల హైకోర్టు ఆంక్షలు అమలులో ఉండడం వల్ల భూమి కేటాయింపు అంగీకరించమంటూ , అందుకు బదులుగా ఇప్పటికే ఉన్న అతిథి గృహాలను ఈ శాఖలకు కొన్ని అనువైన భవనాలను కేటాయిస్తామంటూ తెలియజేశారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖను డిసెంబర్ 16వ తేదీన జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో చర్చించారు. తిరుమల కొండ పైన భూమి లభ్యత చాలా తక్కువగా ఉందని అందుకే కొన్నేళ్లుగా తిరుమల కొండమీద నిషేధం ఉందని, హైకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించారు అంటూ తెలిపారు. శిధిల వ్యవస్థకు చేరిన గెస్ట్ హౌస్లు కాలేజీలను మాత్రమే పునర్నిర్మించడానికి టీటీడీ అనుమతులు ఇస్తోంది. ఈ కారణం వల్లే అటు డిప్యూటీ సీఎం, మంత్రి అభ్యర్థనను తిరస్కరించాల్సి వచ్చిందని టీటీడీ తెలియజేసింది.