హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: జీరో నుండి హీరో గా మారిన పొలిటికల్ స్టార్..ఇప్పుడు మోదీ రైట్ హ్యాండ్..!

Thota Jaya Madhuri
నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు నారా లోకేష్. ఒకప్పుడు రాజకీయ అనుభవం లేదని, మాట తడబడతాడని, “పప్పు” అంటూ విమర్శలు ఎదుర్కొన్న లోకేష్, ఈ రోజు అదే విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నారా లోకేష్ పేరు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనే కాకుండా, ఢిల్లీ రాజకీయ వేదికలలో కూడా ఆయన పేరు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకుంటూ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్నిహితంగా పనిచేస్తూ రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.



అందులో ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ పెట్టుబడులు కేవలం ఉద్యోగావకాశాలకే కాదు, టెక్నాలజీ హబ్‌గా విశాఖను మార్చే దిశగా కీలక అడుగు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కొద్ది సంవత్సరాల క్రితం వరకు లోకేష్ రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. “అసలు కెరియర్ లేదూ”, “రాజకీయాలకు పనికిరాడు” అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు, కొందరు సీనియర్ రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే, అలాంటి జీరో స్థితి నుంచి క్రమంగా తన పనితనం, దూరదృష్టి, రాజకీయ వ్యూహాలతో ఎదిగి, ఈ రోజు తండ్రి చంద్రబాబు నాయుడిని మించే స్థాయికి చేరుకున్నాడేమో అన్న చర్చ కూడా టిడిపి వర్గాల్లో వినిపిస్తోంది.



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి మోదీ దగ్గర నుంచి లోకేష్‌కు వచ్చిన గుర్తింపు, ఆయన రాజకీయ స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది. టిడిపి నాయకులు దీనిని “వెరీ గ్రేట్ అచీవ్‌మెంట్”గా అభివర్ణిస్తున్నారు. కొంతమంది అయితే భవిష్యత్తులో నారా లోకేష్ మోదీ రైట్ హ్యాండ్‌గా ఎదుగుతాడేమో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా మొదలుపెట్టారు.ప్రత్యేకంగా 2025 సంవత్సరం నారా లోకేష్ రాజకీయ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి, పెట్టుబడులు, కేంద్రంతో సమన్వయం, పార్టీ బలోపేతం—అన్ని రంగాల్లోనూ ఆయన యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ సంవత్సరాన్ని “నారా లోకేష్ ఇయర్”గా కూడా పిలుస్తున్నారు.



మొత్తానికి, ఒకప్పుడు విమర్శలతో ప్రారంభమైన నారా లోకేష్ రాజకీయ ప్రయాణం, ఈ రోజు ప్రశంసలు, గుర్తింపులతో కొనసాగుతోంది. జీరో నుంచి హీరోగా మారిన ఈ ప్రయాణం, భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: