ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు మార్మోగిపోతుంది అంటూ చంద్రబాబు తాజాసభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు తాజాగా తిరుపతిలో జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సు లో పాల్గొన్నారు. ఇందులో భారతదేశం గురించి మోడీ ప్రభుత్వం చేసే అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక ఇదే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గారి నాయకత్వంలో భారత దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది అని చాలా రోజుల నుండి వస్తున్న అవాస్తవాలకు చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో చెక్ పెట్టారు. మోడీతో చంద్రబాబు విభేదిస్తున్నారు అనే వార్తలకు చెక్ పెడుతూ మోడీ గారి నాయకత్వానికి పూర్తి మద్దతుని తెలిపారు
.అలాగే 2038 నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ శక్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే భారతదేశంలో నాలెడ్జికి కొదవలేదు ఉంటూ చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాదికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ స్థానానికి వస్తుందని తెలిపారు.కానీ చంద్రబాబు నాయుడు మాత్రం 2038 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు ఇండియాకి త్వరలోనే సూపర్ పవర్ ఖాయమని చెప్పుకొచ్చారు.
ఇండియాలో ఎంతోమంది శాస్త్రవేత్తలు జ్ఞానాన్ని సమూపార్జన చేసి కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. జీరో ను కనిపెట్టింది ఇండియా వాళ్లే, మైండ్ కి పదును పెట్టే చదరంగా క్రీడను కనిపెట్టింది కూడా ఇండియా వాళ్ళే. అలాగే ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు.. గణిత శాస్త్రంలో భాస్కరాచార్య, ఆస్ట్రానమీలో ఆర్యభట్ట, వైద్యశాస్త్రంలో ధన్వంతరి,చరక వంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశంలోనే పుట్టారంటూ ఇండియాని గొప్పగా కొనియాడారు. అలాగే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం లోకి వెళుతుంది.ఆ టైంలో పేద ధనిక బేధాలు తగ్గే వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.