జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు హంగామ ఓవర్ యాక్షన్.. ఫుల్ గా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు..!

Thota Jaya Madhuri
మరోసారి వైసీపీ మూకలు బరితెగించాయి. దానికి సంబంధించిన వార్తలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.  శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వైసీపీ పాలనలో బరితెగించి వ్యవహరించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో జరిగిన ఘటన జనాలు షాక్ అయ్యేలా చేసింది.



తాజాగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని దొరసానిపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  దానికి కారణం మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరులు బహిరంగంగా వీరంగం సృష్టించడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు, చట్ట నిబంధనలను పూర్తిగా విస్మరించి బైకుల సైలెన్సర్లను తొలగించి అధిక శబ్దంతో ర్యాలీ చేపట్టారు. ఈ చర్యలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని భయాందోళనకు గురయ్యారు.



సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శబ్ద కాలుష్యానికి కారణమైన బైకులను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. బైక్‌ను సీజ్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని దొరసానిపాడు గ్రామ సర్పంచ్ లక్కభత్తుల సిద్దిరాజు, అతని అనుచరులతో కలిసి పోలీసులను బెదిరించినట్లు సమాచారం. అంతేకాదు, బైక్‌పై పెట్రోల్ పోసి అంటించేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులను నెట్టివేయడమే కాకుండా, వారి కాలర్ పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వెంటనే అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.



ఈ ఘటనకు సంబంధించి దొరసానిపాడు సర్పంచ్ లక్కభత్తుల సిద్దిరాజుతో పాటు మరో ముగ్గురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, పోలీసుల విధులకు అడ్డంకులు కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, దౌర్జన్యానికి దిగడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఏలూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: