కాంగ్రెస్ పార్టీని మడతపెట్టి సోనియాని ఢీ కొట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి..!

Pandrala Sravanthi
వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఒకసారి అధికారంలోకి కూడా వచ్చారు.. అలాంటి జగన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జగన్ మొదట్లో రాజకీయాల్లోకి రాకుండా బిజినెస్ మొదలుపెట్టారు.. సాక్షి పేపర్ స్థాపించి మెల్లిమెల్లిగా రాజకీయాలను కూడా అవపోషణ పట్టగలిగారు. తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కూడా అయ్యారు.


 వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా భావించే కడప నుంచి ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009లో మొట్ట మొదటిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి  విజయం సాధించారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మహానేత మరణం తర్వాత జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా  భావించారు. కానీ అధిష్టానం దీనికి ఒప్పుకోలేదు.. చివరికి రోశయ్యను ముఖ్యమంత్రి చేశారు. అలా తండ్రి మరణంతో ఎంతో మంది గుండెపోటుకు గురై మరణించారు. అలా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు జగన్..


కానీ దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్ పై విసుగు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి, చివరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. జనాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లిపోయారు.. అలా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆ విధంగా జగన్ ఎంతో కష్టపడి ఒక్కో మెట్టెక్కుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి జగన్ ఇప్పుడు తన తండ్రి ఎలాంటి స్థానం సాధించారో ఆయన కూడా అదే స్థానాన్ని కొనసాగిస్తూ ప్రజలకు దేవుడయ్యారు. ఇంతటి రాజకీయ ప్రస్తానాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇండియా హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: