ఆ మంత్రి తీరుతో రేవంత్‌కు తలనొప్పులు తప్పడం లేదా...?
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీపై కేసు నమోదు అయింది. అదికూడా భూకబ్జాకు ప్రయత్నించిన కేసు కావడం.. ఈ విషయంలో ప్రభుత్వం ముందు నుంచి సిన్సియర్‌గా ఉండడంతో తాము ఎవ్వరిని వదిలిపెట్టం అన్న సంకేతాలు పంపినట్లయ్యింది. ఓ సిన్సియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకు వచ్చేసింది. మంత్రి గా ఉన్న వ్యక్తి ఈ తరహా విషయాల్లో చాలా బాధ్యతగా ఉండాలని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి.
బడా కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల పార్టీలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తో పాటు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయనే స్వయంగా నిధులు సమకూర్చారని ప్రచారం ఉంది. ఆయన ముందు ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. వైసీపీకి తెలంగాణ లో భవిష్యత్ లేదని భావించి బీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే కేసీఆర్ , కేటీఆర్ ఎందుకో ఆయనను పెద్దగా ప్రోత్సహించలేదు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా దూరం జరిగి బయటకు వచ్చేశారు.
చివరకు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకుని భారీగా ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడంతోనే ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. ఇప్పుడు పొంగులేటి రాజకీయ వ్యాపారాలు చేస్తున్నారని.. కాంగ్రెస్ హై కమాండ్‌కు సైతం ఆయన ఆదాయ వనరుగా మారడంతనే ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. బిహార్ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ ఫండింగ్ ఇచ్చాడంటున్నారు. ముందు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత ఆయనపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేయడంతో రేవంత్ కూడా పొంగులేటి తీరుతో ఇబ్బందులు పడుతూ సైడ్ చేసేశారంటున్నారు.