ఆదికి పర్ఫెక్ట్ ప్రత్యర్థి మొగుడిని రంగంలోకి దింపిన జగన్.. ఏపీ రాజకీయాలలో నెక్స్ట్ లెవల్ సెన్సేషన్ ఇది..!
ఇక టిడీపీ విషయానికి వస్తే, కడప జిల్లాను లక్ష్యంగా చేసుకొని అనేక ప్రజా కార్యక్రమాలు చేపట్టింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను కమలాపురం నియోజకవర్గంలోని రైతులకు అందించడం కూడా వారి ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో “రాయలసీమ అభివృద్ధితో బాబు ముందుకు సాగుతున్నారు” అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అదే సమయంలో వైసీపీ కూడా ఇక్కడ నుంఛ్డే ప్రక్షాళన మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందుల, జమ్మలమడుగులో వైసీపీ కుటుంబానికి ఎప్పటి నుంచో బలమైన పట్టు ఉంది. అయితే 2024లో జమ్మలమడుగులో వైసీపీకి తొలి ఓటమి వచ్చింది. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కూటమి మద్దతుతో గెలుపొందారు. ఆయన తరచూ జగన్‌పై కఠిన వ్యాఖ్యలు చేస్తూ వస్తన్నారు. జగన్‌ను ఇంతగా విమర్శించిన ప్రత్యర్థి సొంత జిల్లాలో మరెవ్వరూ లేరు అన్న మాటలో సందేహం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డికి బ్రేకులు వేయడానికి జగన్ పక్కా ప్లాన్ సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్లాన్ అమల్లో భాగంగానే జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జిగా రామసుబ్బారెడ్డిని తాజాగా నియమించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో బలమైన నేతగానే ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పటికే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా, అప్పటి టికెట్ డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన కొంత వెనుకపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి జగన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.“ఆదినారాయణ రెడ్డి దూకుడును ఎదుర్కోగలిగేది రామసుబ్బారెడ్డే” అని పార్టీ అంతర్గతంగా చర్చలు జరిగి ఆయనని ట్రాక్ లోకి తీసుకొచ్చారట. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు వరుసగా వస్తున్నాయి — “ఆదికి బ్రేక్ వేయడానికి జగన్ పర్ఫెక్ట్ లీడర్‌ని రంగంలోకి దించారు… జగన్ పొలిటికల్ గేమ్‌చేంజర్ ప్లాన్ సిద్ధం చేశాడు” అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!