కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నికలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన విడుదల కానున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజలు గెలుపు వైపు తీసుకువెళ్తారు అనే నమ్మకం ప్రధాన పార్టీలో బలంగా పెరిగింది. దానితో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పార్టీ సత్తా ఏమిటో నిరూపించుకోవాలి అని తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ , బీ జే పీ పార్టీలు నిర్ణయించుకున్నాయి.
దానితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారాలను చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ అసెంబ్లీ పరిధిలో కేవలం ఆ ప్రాంతంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు , అతని కార్యకర్తలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ బీ ఆర్ ఎస్ , బీ జే పీ పార్టీలకు సంబంధించిన అత్యంత ప్రధాన నాయకులు కూడా ఈ ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్నారు. దానితో రాష్ట్ర ప్రజల దృష్టి ఈ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ..? ఎవరు ఓడుతారు ..? గెలుపు ఓటమిల మధ్య తేడా ఎలా ఉంటుంది ..? అనే దానిపై జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా మొదటి ఆప్షన్ గా గెలవడం , ఆ తర్వాత రెండవ ఆప్షన్ గా రెండవ స్థానంలో ఉండడం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
మూడవ స్థానంలో ఉన్నట్లయితే ప్రజలు ఆ పార్టీపై పెద్దగా ఆదరణ చూపించడం లేదు అనే అభిప్రాయం జనాల్లో నెలకొంటుంది. దానితో కచ్చితంగా గెలవాలి ... లేదంటే కనీసం రెండవ స్థానంలో అయినా ఉండాలి అనే దానిపై ఈ ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టినట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ..? ఎవరు రెండవ స్థానంలో ఉంటారు ..? ఎవరు మూడవ స్థానంలో ఉంటారు ..? అనేది మరికొన్ని గంటల్లో తెలియబోతోంది.