హైదరాబాద్ లో ప్లాట్ల వేలం.. చాలా తక్కువ ధరలో.. బంపర్ ఆఫర్?
తొర్రూర్ ప్రాంతంలో రెండు వందల నుంచి ఐదు వందల చదరపు గజాల విస్తీర్ణం ఉన్న నూట ఇరవై ప్లాట్లు వేలంలో ఉన్నాయి. ప్రతి చదరపు గజానికి కనీస ధర ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించారు. కుర్మల్‌గూడలో రెండు వందల నుంచి మూడు వందల చదరపు గజాల మధ్య ఉన్న ఇరవై తొమ్మిది ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం ధర ఇరవై వేల రూపాయలుగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు నగర శివార్లలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి.
భవిష్యత్తులో ఇక్కడ ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది.బహదూర్‌పల్లి ప్రాంతంలో రెండు వందల నుంచి వెయ్యి చదరపు గజాల వరకు ఉన్న పద్దెనిమిది ప్లాట్లు వేలంలోకి వస్తున్నాయి. కార్నర్ ప్లాట్లకు చదరపు గజం ధర ముప్పై వేల రూపాయలు కాగా మిగతా ప్లాట్లకు ఇరవై ఏడు వేల రూపాయలుగా నిర్ధారించారు. ఈ ప్రాంతం హైవే సమీపంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణ. వాణిజ్య రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనువుగా ఉంటుంది. ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు