“కల్వకుంట్ల” ఫ్యామిలీలో ఫుల్ లొల్లి.. ఫాం హౌస్‌లో స్టార్ హీరోయిన్ పార్టీలు..!

Thota Jaya Madhuri
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు ఊహించని విధంగా ఉన్నాయి. సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం మరియు ప్రతిపక్షం మధ్య విభేదాలు సహజం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. తమ సొంత పార్టీ నేతలే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు.ఇప్పటికే మూడు రోజులుగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్‌ఎస్ అభిమానుల్లోనే విపరీతమైన చర్చలకు దారితీసింది. కవిత పార్టీకి ఇచ్చిన సేవలు పక్కనబెట్టి, ఆమెను కఠినంగా సస్పెండ్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది కవితకు మద్దతు ప్రకటిస్తూ బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.



కల్వకుంట్ల ఫ్యామిలీలో వ్యక్తిగత విభేదాలే ఈ రాజకీయ సంక్షోభానికి కారణమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి దేశ రాజకీయాల్లో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబం, ఇప్పుడు అంతర్గత కలహాలతో ప్రజల్లో ప్రతికూల ఇమేజ్‌ను సృష్టించుకుంటోంది. నేషనల్ మీడియా, లోకల్ మీడియా, సోషల్ మీడియా కల్వకుంట్ల కుటుంబాన్ని ఒక సంచలన ఐటమ్‌గా చూపిస్తూ ట్రెండింగ్ న్యూస్‌లా రిపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ రాజకీయ తుపానులో మరో కోణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 

ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్‌గా పేరుపొందిన ఒక నటి, గతంలో కల్వకుంట్ల ఫ్యామిలీ కారణంగా భారీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అప్పట్లో ఆమెపై వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. తన కెరీర్‌కి మచ్చ తెచ్చేలా తప్పుడు వార్తలు రాయడం వల్ల ఆ హీరోయిన్ సినీ ప్రయాణం కూడా గణనీయంగా దెబ్బతింది. ఆ నటి ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, కల్వకుంట్ల కుటుంబంతో ఉన్న కొన్ని సంబంధాల కారణంగానే ఆమెకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే కొద్దిరోజులపాటు ఆమెకు మద్దతు ఇచ్చారు. కానీ ఆ తర్వాత అందరూ మౌనం వహించడంతో ఆ స్టార్ హీరోయిన్‌కి ఆ నింద జీవితాంతం మచ్చలా మిగిలిపోయాయి. ఈ అనుభవం వల్ల ఆ నటి మనసులో కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ఆవేదన ఇప్పటికీ తగ్గలేదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.



ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలను చూసి, ఆ నటి తన గుండెల్లో మిగిలిన బాధకు ఒక రకంగా తృప్తి పొందుతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో తనకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఈ కుటుంబానికి తిరిగి కర్మ రూపంలో తగిలిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కుటుంబం ఏకగ్రీవంగా ఉంటే, తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్ నిలిచేది అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ నేడు ఈ ఫ్యామిలీలో ఐక్యత లేకపోవడంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రజల్లో కూడా బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై విశ్వాసం తగ్గిపోయింది. చాలా మంది “ బీఆర్‌ఎస్ ఏమి చేసినా తిరిగి పాత స్థాయికి చేరుకోవడం కష్టమే” అంటూ స్పష్టంగా మాట్లాడుతున్నారు.



ఇంతటి రాజకీయ కల్లోలం మధ్య, ఆ స్టార్ హీరోయిన్ మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌లో ఘనంగా పార్టీలు చేసుకుంటోందట. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు “కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు కొనసాగుతుండటంతో ఆమె సంతోషంగా పార్టీలు చేస్తోంది” అని చెబుతుంటే, మరికొందరు “ఆమె వ్యక్తిగత జీవితానికి ఇది సంబంధం లేదు” అంటున్నారు. ఏదేమైనా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు విషయాలు ఒకేసారి పెద్ద చర్చలకు దారితీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: