భవిష్యత్తులో వ్యవసాయం చేయలేరా.. పెట్టుబడులు ఆ స్థాయిలో పెరిగాయా?

Reddy P Rajasekhar
గత కొన్నేళ్లుగా భారతదేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి భారీగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ పెట్టుబడులకు అనుగుణంగా రైతుల ఆదాయం పెరగకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగినప్పటికీ, రైతులకు లాభాలు మాత్రం రావడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి.

ముఖ్యంగా, వ్యవసాయానికి అవసరమైన కూలీల రేట్లు, ఎరువుల ధరలు, రవాణా, మరియు ఎగుమతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పంట పండించడానికి అయ్యే ఖర్చులకు తగిన ఆదాయం రావడం లేదు. పంటకు మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడం దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్ రేట్లు అనూహ్యంగా పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా వెనక్కి రాక, రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి సరైన మద్దతు ధర లేకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పంటను నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేక, రైతులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడులు పెరిగినా, రైతుల ఆదాయం మాత్రం స్థిరంగా లేదా తక్కువగా ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల రైతులను  ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రాబోయే రోజుల్లో అయినా న్యాయం జరుగుతుందేమో చూడాలి.

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: