నెల్లూరు పాలిటిక్స్ లో సెన్సేషన్ – టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ కలకలం!
దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ కేసును పోలీసులు గోప్యంగా రిజిస్టర్ చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్వయంగా ఈ కేసుపై మానిటరింగ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇస్కపాళెంకు చెందిన ఒక వ్యక్తిని అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక, వేమిరెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటంతో పోలీసులు అనుమానాలు మరింత పెంచుకున్నారు. ఇక ఈ లేఖ వ్యవహారం బయటకు రావడంతో నెల్లూరులో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె రెండు రోజుల క్రితం తన హత్యకు కుట్ర జరుగుతోందని బాంబ్ వేసిన విషయం తెలిసిందే.
ఇక తన క్వారీ దగ్గర డ్రోన్ ఎగురవేసి తనపై రెక్కీ చేశారని, చివరి నిమిషంలో తన కార్యక్రమాలను మార్చుకోవడం వల్ల తప్పించుకున్నానని కావ్య ఆరోపించారు. అంతేకాకుండా ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా కావ్య స్పష్టం చేశారు. ఒకవైపు కావ్య కృష్ణారెడ్డి హత్యాయత్నం ఆరోపణలు .. మరోవైపు ప్రశాంతిరెడ్డి బెదిరింపు లేఖ కలకలం – రెండూ నెల్లూరులో ఒకేసారి వెలుగులోకి రావడంతో జిల్లా రాజకీయాల్లో పెను కలకలం రేగింది. రెండు మహిళా ఎమ్మెల్యేలు టార్గెట్ అవుతున్న ఘటనలు టాప్ డిస్కషన్ గా మారాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఈ బెదిరింపుల వెనుక నిజంగా గ్యాంగ్ ఉన్నదా? లేక ఇది కేవలం రాజకీయ ఆటలలో భాగమేనా? సమాధానం కోసం అందరి కళ్లూ పోలీసుల దర్యాప్తుపైనే నిలిచిపోయాయి