టీసీఎస్ కంపెనీలో 30,000 మందిని తొలగిస్తున్నారా.. వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవాలివే!
అయితే ఈ నిర్ణయంఏకంగా 30000 మందిపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. 12,000 మంది ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నైలో మంగళవారం రోజున యునైట్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు ఆందోళనను చేపట్టారు. టీసీఎస్ కు వ్యతిరేకంగా ప్లకార్డులతో పాటు బ్యానర్లను ప్రదర్శించింది.
సీనియర్, మేనేజర్ స్థాయి ఉద్యోగులను మాత్రమే టీసీఎస్ తొలగిస్తుండటం గమనార్హం. ఈ ప్రక్రియలో 30,000 నుంచి 40,000 మందిపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని జనని అనే యునైటెడ్ లీడర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు బదులుగా తక్కువ జీతంతో టీసీఎస్ కొత్తవాళ్లను నియమించుకుంటోందని యునైట్ తెలిపింది.
ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వాళ్ళ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నించాలని యునైట్ కోరింది. ఈ ఊహాగానాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే టీసీఎస్ రాబోయే రోజుల్లో మరి కొందరి ఉద్యోగులను తొలగించకుండా ఉంటే బాగుంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు