
ఫ్రీ ఆర్టీసీ బస్సు ఎఫెక్ట్... వైసీపీకి అనుకుందొకటి.. అయ్యిందొకటి... !
ఈ నిర్ణయం కేవలం రవాణా సౌకర్యం కాదు.. ఒక విధంగా రాజకీయంగా కూడా వ్యూహాత్మక అడుగనే చెప్పాలి. ఇంటి బయటికి రాగానే ఉచితంగా జర్నీ చేసే బస్సు అందుబాటులో ఉండడం ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగిస్తుంది. ఇతర పథకాల ప్రభావం ఎలా ఉన్నా, ఈ సౌకర్యం తక్షణ ఫలితాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. “ఉచితం అంటే కేవలం మండలాల మధ్యకే, జిల్లాల మధ్యకే” అని విమర్శలు గుప్పించింది. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఉందని ఆరోపణలు చేసింది. ఈ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణి కల్పిస్తూ వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ నిర్ణయం వెనుక మరొక వ్యూహం కూడా ఉంది. ఇప్పటి వరకు ఇతర పథకాల లబ్ధి పొందని మధ్యతరగతి వర్గాలు కూడా ఈ పథకం ద్వారా కూటమి పట్ల సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఆర్థికపరంగా చూసినా, ఇతర పథకాల కోసం ఏటా రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే, ఉచిత బస్సు సర్వీసుకు కేవలం రూ.2 వేల కోట్లు సరిపోతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధిదారులను సంతోషపెట్టే ప్లాన్‌గా దీనిని చూడాలి. చంద్రబాబు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వైసీపీకి రాజకీయంగా బ్రేకులు వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.