కేసీఆర్ రావణుడై ఫామ్ హౌసులో నిద్రపోతున్నారు.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు?
కేసీఆర్ గతంలో తెలంగాణకు మరణశాసనం రాశారని, కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు. బనకచర్ల విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పటికీ, కేసీఆర్ తప్పులను కప్పిపుచ్చుకుని ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని విమర్శించారు. గోదావరి జలాల దొంగలు ఎవరో అసెంబ్లీలో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ రైతులకు నష్టం కలిగించిన వారిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రేవంత్ తెలిపారు. సాగును లాభసాటిగా మార్చే వరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రైతులను రాజులుగా చూడాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని చచ్చిన పాముతో పోల్చిన రేవంత్, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సత్యాన్ని గుర్తించారని అన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు