సింధూర్: యుద్ధం గురించి గరికపాటి నరసింహారావు సంచలన వీడియో..!

Divya
ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఈ తరుణంలోనే తాజాగా గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ యుద్ధం అంటూ వస్తే మాత్రం కచ్చితంగా మొదటి భాగం మనదే కావాలి.. బతకనీయొద్దు శత్రువులని అదే రాజనీతి అంటూ శ్రీరామచంద్రుల వారు ఉదహరించారు.. శత్రువుల గుండెల మీద కూర్చొని మరి జయించాలి అంటూ తెలిపారు.. రావణాసురుడుని రాముడు ఎక్కడ జయించాడు.. హోమ్ పిచ్చిలో కాదు లంకకు వెళ్లి మరి కొట్టాడు దెబ్బ .. లంకకు వెళ్లి మరి కొట్టాడు అది రామాయణం మనకు నేర్పింది.. అందుకే ఎవరూ కూడా చేతులు ముడుచుకొని కూర్చో మనలేదని తెలిపారు.



అలాగే మనం ఎవరికీ కూడా అన్యాయం చేయకూడదు అందుకే శ్రీరాముడు భార్యను కాపాడుకోవడానికి యుద్ధం చేశారు.. కానీ పినతల్లి రాజ్యం అడిగితే అరగంటలో అరణ్యవాసానికి వెళ్లిపోయారు శ్రీరాముల వారు అంటూ వివరించారు. మన రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఇదేనంటూ తెలియజేయడం జరిగింది గరికపాటి నరసింహారావు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే ఇప్పుడు ట్రెండీగా మారుతున్నది. ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్లాలనిపిస్తోంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి వారిని మరింత కట్టుదిడ్డమైన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ సైతం అతలాకుతలం అవుతోంది. మరి రాబోయే రోజుల్లో మరింత క్షీణించే  పరిస్థితులు పాకిస్థాన్లో కనిపిస్తున్నాయట. ఇప్పటికే చాలామంది యుద్ధం వద్దని వేడుకుంటున్నారు. రక్షణ అధికారులు జవాన్లు సైతం ఉద్యోగాలను మానేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: