అమెరికాకి షాకిచ్చిన మోడీ.. మీ అవసరం లేదంటూ.?

Pandrala Sravanthi
జమ్మూకాశ్మీర్ లోని పెహల్గామ్ లో దాడిలో భారతీయ పౌరులు 26 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో భారతదేశం మొత్తం ఉగ్రవాదులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పి ఉగ్రవాదాన్ని అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక ప్రోగ్రాం మొదలుపెట్టింది. అంతేకాకుండా మే 7వ తేదీన రాత్రి ఉగ్ర స్థావరాలపై విపరీతమైన దాడులు చేసింది. దీంతో దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు కూడా మరణించారని తెలుస్తోంది. అంతేకాకుండా  ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని  భావిస్తున్న ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పై విరుచుకు పడుతూనే ఉంది. మే 8న రాత్రి సమయంలో  పెద్ద ఎత్తున దాడులు చేసింది.


 ఇదే సమయంలో స్పందించిన పాకిస్తాన్  కూడా ఇండియాపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేయగా మన ఇండియన్ ఆర్మీ వారు వేసిన క్షిపణి  బాంబులను  గాలిలోనే నిర్వీర్యం  చేసింది. ఇదే తరుణంలో పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేయాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ఇండియా పాక్ ఆలోచనలకు దీటుగా ముందుకు వెళ్లడంతో  రెండు దేశాల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇలా యుద్ధం నడుస్తున్న వేళ అమెరికా రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కానీ ఇండియా ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్ తో మాకు ఉన్నటువంటి సమస్యలు ద్వైపాక్షికమైనవని వాటిని ఇరుదేశాలు మాత్రమే కూర్చొని చర్చించుకోగలమని తెలియజేసింది. మా రెండు దేశాల మధ్య మూడో పక్షం జోక్యం అవసరం లేదని భారత్ చెప్పేసింది.


ముఖ్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దు వివాదం భారత్ పాక్ మధ్య ఎక్కువగా సమస్యత్మకంగా మారింది. ఈ రెండు సమస్యలకు పాకిస్తాన్ తలవంచి వచ్చి భారత్ కు సహకరిస్తే  బాగుంటుంది అనే విధంగా ఇండియా ఎదురుచూస్తోంది. ఇందులో మూడవదేశం భాగస్వామ్యం అవసరం లేదని  భారత్ స్పష్టం  చేయడంతో  అమెరికా సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం భారత్ దగ్గర దాదాపు పదివేల కిలోమీటర్ల దూరంలో కూడా శత్రుముకలను పడగొట్టే శక్తి సామర్థ్యం కలిగిన క్షిపణులున్నాయి. ఇంతటి శక్తివంతమైన దేశంపై పాకిస్తాన్ ఏ మూలన కూడా దాడి చేయడానికి సరిపోదు. ఈ సమయంలో అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాయి అంటే  భారత్ సున్నితంగా తిరస్కరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: