ఏపీ తిరుపతి: కొత్త తరహా మోసం.. భక్తులు తస్మాత్ జాగ్రత్త..!

Divya
తిరుమల తిరుపతికి ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో వెళుతూ ఉంటారు..  భక్తులను ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తూ ఉన్నారట. ఇటీవలే తమిళనాడులోని మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ గత కొద్దిరోజులుగా కొండపైన మోసాలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులు గుర్తించారు.. మురగన్ సైతం పోలీసులు అరెస్టు చేసి మరి స్టేషన్లో వేశారు. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులను మాంగల్య పూజ పేరుతో మోసం చేసినట్లుగా భక్తుల సైతం కంప్లైంట్ ఇవ్వడంతో అసలు నిజం బయటపడింది.


అసలు విషయంలోకి వెళ్తే టీటీడీ ఉద్యోగి నందు తిరుమల పరిసరాలలో తిరుగుతూ భక్తులను సైతం మాయమాటలతో నమ్మించి మరి మోసాలు చేస్తున్నారట మురుగన్ నాగరాజ్. భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని ఆలయం ముందు మాంగల్య పూజ వంటివి చేయించుకోవాలి అంటూ భక్తులకు ఎరవేస్తూ మోసగిస్తూ ఉన్నారు. అలా తమిళనాడు నుంచి వచ్చిన ఉచిమహలి అనే మహిళతో మొదట మాటలు కలిపి ఆ తర్వాత ఉద్యోగిగా పరిచయం చేసుకొని.. తిరుమల గురించి తెలియజేస్తూ మాంగల్య పూజ చేస్తే కుటుంబానికి భర్తకు మేలు అంటూ.. ఆ తర్వాత బీడీ ఆంజనేయస్వామి షాపింగ్ మాల్ కి తీసుకువెళ్లి రెండు డజన్లో మట్టి గాజులు ఇచ్చి.. ఆమె వద్ద ఉన్న బంగారు మాంగల్య సూత్రం, రెండు సెల్ ఫోన్లు, లక్ష్మీ డాలర్ చైన్ తో సహా తీసుకున్నారట. ఆ తర్వాత శ్రీవారి పుష్కరణకు వెళ్లి అక్కడ స్నానం చేసి మరి గుడి ముందుకి రమ్మని చెప్పి పరారయ్యారట



అయితే ఇలాంటి మోసాన్ని మరొక్కసారి మార్చి 14న మురగ చేశారు. మరొక మహిళ వద్ద 80 గ్రాములు బంగారు కాజేశారు. ఆ తర్వాత మార్చి 18న లక్ష్మీ అని మహిళ వద్ద కూడా ఇదే తరహాలోనే మోసం చేయడంతో ఆమె వద్ద ఉన్న 12 గ్రాములు బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడట. ఈ ముగ్గురు మహిళలు ఒకే నిందితుడు పేరు చెప్పడంతో మురుగన్ను చివరికి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే గత 35 ఏళ్లుగా తను ఇలాంటి నేరాలనే చేస్తున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇది మురగని పైన తమిళనాడు ఏపీలో 20కి పైగా కేసులు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: