టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఈ చిన్నది కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన నటన, అంద చందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.
తన నటనకు గాను శృతిహాసన్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక శృతిహాసన్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాష చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
శృతిహాసన్ గత కొన్ని సంవత్సరాల నుంచి శాంతను హజారికాతో రిలేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా కొన్ని రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రిలేషన్షిప్ గురించి తనను చాలామంది అడుగుతున్నారని శృతిహాసన్ వెల్లడించారు. రిలేషన్షిప్ లో తాను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. మన అందరి జీవితంలో ఒక మాజీ ఎక్స్ ఉంటారు.
అది తప్ప మిగతా బంధాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండానే నేను ముగించానని శృతి అన్నారు. ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే అతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నేను కోరుకున్న ప్రేమ దక్కకపోవడం వల్లనే ప్రేమలో విఫలమవుతున్నానని అది చాలా బాధ పెడుతుంది అంటూ శృతిహాసన్ చెప్పారు. నేను ఎప్పుడూ నా మాజీ ప్రియులను నిందించను అంటూ శృతిహాసన్ మాట్లాడారు. శృతిహాసన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.