
ఏపీ: సినీ పరిశ్రమ ఏపీకి రావాలి అంటే.. ఆ పని చేయాల్సిందే..?
ఆంధ్రప్రదేశ్ కి సినీ పరిశ్రమ తరలి రావాలి అంటూ ఇటీవలే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. అలాగే మొన్న గంట శ్రీనివాసరావు కూడా చెప్పారు.. అల్లు అరవింద్, చిరంజీవి వంటి వారు విశాఖపట్నంలో స్టూడియోలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే మాట్లాడారు. ఒకవేళ వారు కడితే మిగతా వాళ్ళు రావచ్చు. ఇక ప్రభుత్వం పరంగా రప్పించాలి అంటే.. 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ ఏఎన్ఆర్ స్టూడియో వంటి వాటిని చూసి అలాగా ఏర్పాటు చేస్తే .. సినీ పరిశ్రమ తరలివస్తుందని చాలామంది సిని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
హైదరాబాదులో స్టూడియోలలో ఏదైనా కావాలి అంటే డబ్బు చెల్లిస్తే చాలు చివరికి వారు అనుకున్నట్టుగానే సినిమా అవుట్ పుట్ షూటింగ్ జరుగుతూ ఉన్నది. అలాంటి ఏర్పాటు హైదరాబాదులో ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే అది చాలా కష్టమని చెప్పవచ్చు. కానీ ఏర్పాట్లు చేయడం అనేది చాలా ముఖ్యం.. అంత సిద్ధం చేసి పెట్టారంటే షూటింగులకు వస్తారు. అలాగే కొన్ని విల్లాల టైపులో, లగ్జరీ అపార్ట్మెంట్ టైపులో కొన్ని కొన్ని భవనాలను కూడా కట్టించాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ కి వస్తే అక్కడ ఉండడానికి లగ్జరీ వ్యక్తులకు కూడా సరిపోతుంది.
ఇక సినిమా షూటింగ్ కోసం వచ్చిన వారందరికీ కూడా ఉండడానికి వసతి గృహాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యం.. ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం మంచిది. అప్పుడే షూటింగులు అనేవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వైజాగ్ వంటి ప్రాంతాలలో లొకేషన్స్ కూడా బాగుంటాయి.. అయినా కానీ అక్కడ తగినటువంటి వసతులు మాత్రం లేవు. వస్తే స్టార్ హాస్టల్స్లో నటులను దించితే.. నిర్మాతలకు, దర్శకులకు భారీ ఖర్చులు అవుతున్నాయట. చిన్న నిర్మాతలు రావడానికి సిద్ధంగానే ఉన్న ఇలాంటి ఖర్చుల వల్ల భయపడుతున్నారట. మరి వీటిని కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి సాధించి ముందుకు వెళితే సక్సెస్ అవుతారు.