ఏపీ: బండ్ల గణేష్ ట్విట్.. నాగబాబుకే కౌంటర్ అంటూ వైరల్..!
అయితే మెగా కుటుంబం పైన ఎప్పుడైనా ఏదైనా అన్నా కూడా ఖచ్చితంగా ఫైర్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా నాగబాబుకే కౌంటర్ వేయడం అన్నది సోషల్ మీడియాలోనే సంచలనంగా మారింది. ఈ విషయం పైన అటు టిడిపి నేత వర్మ ఫ్యాన్స్ ఖుషి అవుతు ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం బండ్ల గణేష్ మాట్లాడింది కరెక్ట్ కాదు అంటూ పలు రకాలుగా పోస్ట్లు అయితే షేర్ చేస్తున్నారు. మరి కొంత మంది నాగబాబుకు అదిరిపోయే కౌంటర్ వేసావ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అందుకు సంబంధించి ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ తెలంగాణ కాంగ్రెస్ లో మక్కువ చూపుతు ఉండేవారు.అయితే ఈమధ్య అక్కడ కూడా పొలిటికల్ పరంగా కొంతమేరకు సైలెంట్ గానే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి బండ్ల గణేష్ నాగబాబుకే కౌంటర్ వేశారా లేకపోతే ఏంటన్నది చూడాలి మరి.