పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరుకి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు పవన్ కల్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు ఆయన ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు.అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్నాడు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ భాద్యతలు వహిస్తున్నారు..అయితే తన పవన్ రాజకీయ అరంగ్రేటం గురించి నిన్న ఎంతో అర్భాటంగా జరిగిన జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ వేడుకలో కీలక వ్యాఖ్యలు చేసారు.. ఈ వేడుక జనసేన పార్టీ సభ్యులకి ఆనందాన్ని కలిగించింది.. పార్టీ ప్రారంభించి 10 ఏళ్లు అయినా ప్రజామద్దతు లేకపావడంతో ఒకానొక పరిస్థితిలో పవన్ పార్టీ నడపడమే కష్టమైపోయేది..
కానీ గత ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంతో జనసేన నాయకుల్లో ఊహించని ఉత్సాహం వచ్చింది.. అందుకే ఈ 12 వ ఆవిర్భావ వేడుకకు అభిమానులు, కార్యకర్తలు జోరుగా పాల్గొన్నారు.. ఆ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి..2009 లో ప్రజారాజ్యం పార్టీతో నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ 2003 లోనే నేను రాజకీయాల్లోకి వెళ్తా అని నా తండ్రికి చెప్పాను.. సమాజం మీద బాధ్యతతో ఆలోచించా. సినిమాల పరంగా ఎదగాలని అనుకోలేదు. నా ఖుషీ సినిమా చూసి గద్దర్ మా అన్నయ్యల ద్వారా నన్ను కలిశారు. ఏ మేరా జహా అనే పాటలో నా సీన్స్ చూసి.. నన్ను గద్దర్ అభినందించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది.
2006 లో ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి రాజకీయాల్లోకి వస్తారా అని నన్ను అడిగారు. నాకు అప్పుడు రాజకీయాలపై అవగాహన లేదని, మెచ్యూరిటీ వచ్చాక వచ్చి కలుస్తా అని చెప్పాను. ఆ వ్యక్తిని ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఆయనే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు అని పవన్ తెలిపారు..నన్ను సినిమాల్లో చూసి ఓజీ అంటున్నారు. నేను సమాజం కోసం ఆలోచన చేసే ఇటువంటి వారిని చూస్తానని పవన్ అన్నారు...