
రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక ప్రకటన
ఇక ఇప్పటికే ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందిందని స్పష్టం చేశారు. నాలుగు, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కూడా త్వరలోనే సాయం అందుతుందని అన్నారు. విడతల వారీగా డబ్బులు విడుదల చేస్తామని.. అలాగే అర్హత కలిగిన రైతులందరికి ఆ సాయం అందేలా చర్యలు తీసుకుంటామమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.
అయితే కొత్తగా ల్యాండ్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలను మరియు బ్యాంక్ అకౌంట్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. పరిశీలన పూర్తయ్యాక వారి ఖాతాలలో కూడా నిధులు జమ చేస్తామని భరోసానిచ్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలిసి పని చేసుకుని.. రైతు భరోసా సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిధులు కూడా విడుదల