
ఏపీ: ముద్రగడ ఇంటిపై.. యువకుడి దాడి.. ఎవరంటే..?
ముద్రగడ ఇంటి ముందు ర్యాంప్ పై పార్కు చేసినటువంటి కారును ట్రాక్టర్ తో ఢీ కొట్టి ధ్వంసం చేశారట. ఈ ఘటన పైన పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకొని మరి పోలీసులు అ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే దాడి చేసిన యువకుడు జనసేన కార్యకర్తగా గుర్తించారు. అతని పేరు గని శెట్టి గంగాధర. అయితే తనకి 50 వేల రూపాయలు ఇస్తానంటేనే దాడి చేసినట్లుగా తెలియజేశారట.
ప్రస్తుతం గంగాధర్న పోలీసులు సైతం అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారట.గంగాధర అనే యువకుడు మద్యం సేవించి మద్యం మత్తులో ముద్రగడ కాంపౌండ్ లో పార్కింగ్ చేసిన కారునే కాకుండా ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేశారట. ఈ విషయం తెలిసిన వెంటనే ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని దాడికి పాల్పడిన యువకుడు పైన ఫైర్ అయ్యారు.ఇప్పటికే వైసీపీ పార్టీలో ఉండే నాయకుల మీద జరుగుతున్న దాడులు , కేసులు పెట్టడం వంటి వాటిపైన ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయం పైన ముద్రగడ పద్మనాభం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. గతంలో ముద్రగడ టిడిపి కాంగ్రెస్ వంటి పార్టీలలో కీలకమైన నేతగా ఉన్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ 2014-19లో కాపు ఉద్యమ నేతగా పేరు సంపాదించారు. 2024లో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది.