ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌‌లకు నిర్మలా సూపర్ న్యూస్ .. ఇక వారికి కనక వర్షం..!

Amruth kumar
బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్టప్ ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వాళ్లకు సూపర్ న్యూస్ చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ ప్ కంపెనీలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది . ఇక ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టార్ట్ ప్స్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలాసీతా రామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ..  స్టార్టప్‌లు, మైక్రో స్కేల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులను మరింత వృద్ధిలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు .. వీటికి మరింత ఊతం ఇస్తూ ప్రోత్సాహాలను కూడా ప్రకటించారు ..


ప్రధానంగాఎంఎస్ఎంఈకి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు .. ఇక వీటి ద్వారా 36% ఉత్పాదకత వస్తుందన్నారు స్టార్టప్‌ల కోసం 20 కోట్ల వరకు రుణాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు నిర్మల .. అలాగే ఈ స్టార్ట్ ప్ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అదే విధంగా స్టార్ ప్ కంపెనీలను ప్రోత్సహింగా ఐదు లక్షల లిమిటెడ్ కలిగిన క్రెడిట్ కార్డులు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు .. మొదటి ఏడాది 10 లక్షల మందికి ఈ కార్డులు జారీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు .. అలాగే స్టార్ట్ ప్స్ కోసం ఫండ్ ఆఫ్ ఫండను ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా నిర్మల తెలిపారు .. అదే విధంగా కార్మికులు ఎక్కువగా పనిచేసే కంపెనీలకు కూడా భారీ చేయూత అందిస్తామన్నారు ..


 తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి  లభించనుంది. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పారు. బొమ్మల తయారీ కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. ఇక సూక్ష్మ చిన్న తరహా మధ్యతరగహ పరిశ్రమలకు రాబోయే ఐదేళ్లలో 1. 5 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని కూడా నిర్మల ప్రకటించారు .అలాగే అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ పోస్టల్ శాఖ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖను మార్చడానికి తాము సిద్ధమని చెప్పారు. దానిని దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: