Union Budjet 2025 : మెడిసిన్ చదువాలనుకునే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!!

frame Union Budjet 2025 : మెడిసిన్ చదువాలనుకునే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!!

murali krishna
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నేడు 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు... నేడు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని లోక్ సభ లో ప్రవేశపెట్టారు.. ఏకంగా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రిగా నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించారు..అయితే తాజాగా బడ్జెట్ సెషన్ మొదలైన కొద్ది సేపటికే ప్రతి పక్షాలు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన పై చర్చ జరపాలని పట్టుబట్టాయి.అయినా కూడా విపక్షాల ఆందోళన మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనితో బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభలోని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.


నిర్మలా సీతారామన్ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్‌ అంటూ గురజాడ అప్పారావు రాసిన కవితతో లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. ఇన్నేళ్లలో తాము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశం అయ్యాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది అని ఆమె అన్నారు. పేదరికమే లేని దేశంగా భారత్ ని నిలపాలనే లక్ష్యంగా తాము అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇస్తూ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ మెడిసిన్ చదువుకోవాలనే విద్యార్థులకు వరంగా మారింది..


దేశంలో ఎన్నో లక్షల మంది విద్యార్థులు మెడిసిన్ చదవాలని కలలు కంటూ వున్నారు..కానీ తక్కువ సీట్లు మాత్రమే ఉండటంతో కొందరి కలలు కలలుగానే మిగిలిపోయాయి.. అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు... ఈ నిర్ణయం వల్ల డాక్టర్ కావాలనే ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థుల కల నెరవేరబోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: