![నడక మరిచిపోయిన సునీతా విలియమ్స్.. ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_latestnews/sunitha-williams8845ded7-8e66-4412-a279-8216efbbe4cc-415x250.jpg)
నడక మరిచిపోయిన సునీతా విలియమ్స్.. ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే!
జీరో గ్రావిటీ దగ్గర నెలల తరబడి గడపటంతో కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టమవుతోందని ఆమె అన్నారు. నేను చాలా కాలంగా ఇక్కడ ఉంటుందని నడక ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ఇంతకాలంగా నేను నడవలేదని కూర్చోలేదని పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందని ఆమె కామెంట్లు చేశారు.
జీరో గ్రావిటీ దగ్గర కొన్ని నెలలుగా కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని సునీత వెల్లడించారు. 8 రోజుల మెషిన్ లో భాగంగా సునీత అంతరిక్షంలోకి వెళ్లగా జూన్ 14వ తేదీన తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నా హీలియం లీకేజ్ కారణంగా సమస్యలు ఎదురయ్యాయని సమచారం అందుతోంది.
సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. బైడెన్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాల్సి ఉంది. సునీతా విలియమ్స్ స్పేస్ లోనే ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని ఫేక్ వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో కొంతమేర తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం. సునీ తా విలియమ్స్ క్షేమంగా భూమిపైకి రావాలని కొంతమంది పూజలు సైతం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.