![లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వడం దండగే... టిడిపి ఎమ్మెల్యే?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_analysis/nara-lokeshcaaec816-54f5-44ef-841d-7a6c0e1aab65-415x250.jpg)
లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వడం దండగే... టిడిపి ఎమ్మెల్యే?
తూర్పుగోదావరి జిల్లాలో ఇదే విషయంపై మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి పొలిట్ బ్యూరో, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై పరోక్షంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మొదటి నుంచి ఎన్టీఆర్ వర్గంగా ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి... చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తారు బుచ్చయ్య.
అయితే.. తాజాగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై కూడా భిన్నంగా స్పందించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు..ఇక మరొకరు ఇంకా ఎందుకని టీడీపీ పార్టీ నేతలను నిలదీశారు. నారా లోకేష్... టిడిపి పార్టీ కోసం కష్టించి పని చేశారన్నారు. ఈ తరునంలోనే కూటమి ప్రభుత్వం లో నారా లోకేష్ కు సముచిత స్థానం ఇచ్చారని గుర్తు చేశారు టిడిపి పొలిట్ బ్యూరో, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన టిడిపి నాయకులు చేయడం సరికాదని మండిపడ్డారు బుచ్చయ్య చౌదరి. అలాంటి వాదన తప్పని చెప్పారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని గుర్తు చేశారు. అధికారం కోల్పోయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా వైసిపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు అడ్డుకునేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడతామన్నారు బుచ్చయ్య.