తొక్కిసులాట ఘటన .. కొందరికి ఎముకలు విరిగాయి .. మరికొందూరు నిలిగిపోయారు డాక్టర్లు రిపోర్ట్ ఇదే..?
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ చేసే కౌంటర్ల దగ్గర చోటు చేసుకున్న తొక్కిసులాట ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , దేశవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు . తిరుపతి లో విష్ణు నివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే .. అయితే ఈ ఘటనలో ఆరుగురు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు .. అయితే వారిలో ఐదు మంది మహిళలు ఉన్నారు .. 40 మంది వరకు గాయాలు పాలయ్యారు .. ఇక వాళ్ళందరినీ శ్రీ వెంకటేశ్వర ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ .. శ్రీ వెంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయ ఆసుపత్రులకు తరలించారు.
ఈ తొక్కిసులాట ఘటన లో మొత్తం 6 మంది చనిపోయారు .. అధికారులు వారిని గుర్తించాలి వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఇతర గుర్తింపు పత్రల ఆధారంగా వారి వివరాలు సేకరించారు మృతుల్లో ఇద్దరు పరుగు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు . మృతుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బీ నాయుడు బాబు (51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34) ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందారు. జిల్లా పోలీసు అధికారులు వాళ్ల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
అలాగే స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు .. ఇక వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిలో మొత్తం 19 మంది ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారట.ఇక గాయపడ్డ వారిలో కొందరు పేషెంట్లకు పలు ఫ్రాక్చర్ అయిందని స్వీమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కుమార్ చెప్పుకోవచ్చరు .. అలాగే మరికొందరు నలిగిపోయారని వాళ్ళ కండరాలు , స్కిన్ గాయాలయ్యాయని వివరించారు. స్విమ్స్‌లో మొత్తం 19 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ వారు ఈ సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించడానికి రానున్నట్లు తెలిపారు.