తిరుపతి ఘటనపై చంద్రబాబుకి అధికారులు నివేదిక..?

Pulgam Srinivas
నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భారీ ఎత్తున జనాలు గమ్మి గూడడం , ఆ తర్వాత ఒక్క సారిగా అధికారు లు టికెట్ కౌంటర్ గేట్లు తెరవడం తో ఒక్క సారిగా జనాలు ముందుకు దూసుకు రావడం వల్ల తొక్కిస లాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే ఈ మృతి పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కి అధికారులు నివేదికను అందించారు . ఆ నివేదిక ప్రకారం డి ఎస్ పి అత్యుత్సాహం వల్ల ఒక్క సారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని వారు నివేదికలో పేర్కొన్నారు.

ఆ తరువాత డీ ఎస్ పి సరిగ్గా స్పందించలేదు అని ఎస్ పి వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంబులెన్స్ డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లినట్లు , ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అతను అందుబాటులో లేడని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇకపోతే ఇప్పటికే తిరుమల దేవస్థానం దగ్గర జరిగిన తొక్కిసలట ఘటనపై టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు కూడా స్పందించారు.

ఆయన స్పందిస్తూ తిరుపతి దేవస్థానం వద్ద జరిగిన ఘటనపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు అని , ఆయన ఇలాంటి ఘటన జరిగినందుకు చాలా సీరియస్ గా ఉన్నారు అని , మరోసారి ఇలాంటి ఘటనలు అస్సలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించినట్లు బి ఆర్ నాయుడు తాజాగా తెలిపారు. ఇకపోతే బి ఆర్ నాయుడు మాట్లాడుతూ ... ఈ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానం ఘటనలో బాధితులైన వారికి నష్టపరిహారాన్ని ప్రకటిస్తాడు అని కూడా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: