ఏపీ: అమ్మాయిలతో కలసి మాస్ డాన్స్ వేసిన టిడిపి నేత..వీడియో వైరల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి రాజకీయాలు కూడా ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబం చేసేటటువంటి రాజకీయానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆయన డాన్స్ వేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలను చాలా గ్రాండ్ గా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

పక్కన మహిళలతో అమ్మాయిలతో కలిసి డాన్స్ వేస్తూ ఉన్న జెసి ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 చిత్రంలోని సూసేకి అగ్గి రవ్వ మాదిరే అనే పాటకు డాన్స్ వేయడం జరిగింది. అయితే ఈవెంట్ కు ముందు సినీనటి బిజెపి నాయకురాలు మాధవిలత కూడా పలు రకాల వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా చేసి ప్రభాకర్ రెడ్డి ఆమె పైన ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా మాధవి లత పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వాక్యాల తర్వాతే దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా కాలిపోయాయని ఈ విషయం పైన బిజెపి నేతల పైన జెసి ప్రభాకర్ రెడ్డి దారుణంగానే మాట్లాడారు..ఈ విషయం మీద అటు కూటమిలో కూడా బిజెపి టిడిపి నేతల మధ్య ఒక యుద్ధమే కొనసాగుతోంది.

ఇప్పుడు ఇలాంటి సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి వేస్తున్న డాన్స్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయాల పైన అటు జేసి ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి. మొత్తానికి జెసి ప్రభాకర్ రెడ్డి తన చెప్పాల్సిన వ్యాఖ్యలను కూడా చెప్పడంతో పాటుగా బిజెపి నేతలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా బూడిద వ్యవహారంలో కూడా బిజెపి నేతలకు గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: