కొత్త అవతారం ఎత్తిన ఈనాడు.. ఆశ్చర్యపోతున్న జనాలు..?
ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు కూడా చేరింది. ఈనాడు పెళ్ళిపందిరి పేరుతో వెబ్‌సైట్, యాప్‌ను అలా ఏళ్ళ క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వార్తలు అందించే ఈనాడు సంస్థ ఇప్పుడు పెళ్ళి సంబంధాలు కుదిర్చేందుకు నడుం బిగించడం విశేషం. అయితే ఇప్పుడు కొత్తగా ఈనాడు పెళ్ళిపందిరి ద్వారా ఉచితంగా ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ప్రొఫైల్స్ రిజిస్టర్ చేసుకోవాలంటూ కొన్ని కులాల వారిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తోంది.
అంటే ఈనాడు భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టి పెళ్లి కాని వారిని తమ వేదిక పైకి తీసుకొస్తుంది. ఇటువంటి ఒక జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్ ల ప్రక్రియను ప్రారంభించింది. ఒక నిర్దిష్ట కులాల వారి కోసం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసింది. ఈ వేదికపై ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉండటం దీని ప్రత్యేకత. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ వేదిక సహాయపడుతుంది. తక్కువ ధరలో ప్యాకేజీలతో పాటు, పర్సనలైజ్డ్, వీఐపీ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో కూడా ఈనాడు పబ్లికేషన్ సెంటర్ల వద్ద సేవలు పొందవచ్చు.
ఈనాడు సంస్థ ఇలా మ్యాట్రిమోనియల్ రంగంలోకి అడుగు పెట్టడం ద్వారా తన వ్యాపార పరిధిని విస్తరించుకోవడమే కాకుండా, తెలుగువారికి ఒక నమ్మకమైన వేదికను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఈనాడు, ఇప్పుడు పెళ్ళి సంబంధాల వేదికగా కూడా విజయవంతం అవుతుందో లేదో వేచి చూడాలి. ఈ పరిణామం సాంప్రదాయ మీడియా సంస్థలు తమ బిజినెస్ మోడల్స్ ను మార్చుకోవడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. డిజిటల్ యుగంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త సేవలను అందించడం ద్వారా మనుగడ సాగించవచ్చని ఈనాడు నిరూపిస్తోంది.