కేటీఆర్ కోసం పాట పాడిన హిమాన్షు..!

Veldandi Saikiran
తెలంగాణ మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోసం తన కుమారుడు హిమాన్షు ఓ పాట పాడారు. మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన కుమారుడు అదిరిపోయే కానుకను అందించాడు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా యానిమల్ సినిమాలోని 'నా సూర్యుడివి.... నా చంద్రుడివి' పాటను స్వయంగా హిమాన్షు పాడారు.

ఆ పాటకు తన తండ్రితో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాల ఫోటోలను యాడ్ చేసి వీడియో రూపంలో తయారు చేసి తన తండ్రికి కానుకగా ఇచ్చారు. హిమాన్షు వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ప్రతిసారి చాటుకుంటూనే ఉన్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. అలాగే ఎన్నికల సమయంలోను సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తాడు. గతేడాది ఓ ఇంగ్లీష్ పాటను పాడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు.
 
ఇక తాజాగా తన తండ్రి కేటీఆర్ పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. తెలంగాణ మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పుట్టినరోజు జులైలోనే ఉంది. ఆ సందర్భంలో హిమాన్షు ఓ పాటను పాడారు. ఆ పాటలో తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫోటోలను యాడ్ చేసి వీడియో రూపంలో పొందుపరిచారు. ఇక దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇక దీనిపై కేటీఆర్ స్పందించారు.   "కష్టతరమైన సంవత్సరంలో నాకు దొరికిన ఉత్తమమైన బహుమతి థాంక్యూ బింకు  అని పేర్కొన్నారు. పాట నాకు చాలా నచ్చింది అంటూ కేటీఆర్ అన్నారు.

జూలైలో వచ్చిన నా పుట్టినరోజు కోసం నా కొడుకు ఈ పాటను రికార్డ్ చేశాడు. కానీ అది సరిపోదని భావించి విడుదల చేయకుండా అక్కడే ఆపేశాడు. నేను గత వారమే ఈ పాటను మొదటిసారి విన్నాను. నాన్నగా నాకు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్ ఈ పాటను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద నెటిజన్లు తమదైన శైలిలో యాక్టివ్ గా స్పందిస్తున్నారు. చాలా అద్భుతంగా పాటను పాడాడు అంటూ హిమాన్షును మెచ్చుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: