టీడీపీలో ఇద్దరు శత్రువులు చేతులు కలుపుతారా... ఆయన గెలుపునకు ఎమ్మెల్యే సహకరిస్తారా ?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ని తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు గత కొన్ని దశాబ్దాలు గా రాజకీయంగా శత్రువులు గా మారారు. అసలు ఈ ఇద్దరు ఒకరిని ఒకరు ఎదురుపడితే మాట్లాడుకునేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి నేతలు ఇప్పుడు చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరు ఎవరో ? కాదు. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ .. మాజీ మంత్రి ఆలపాటి రాజా. గత ఎన్నికలలో నాదెండ్ల మనోహర్ కోసం రాజా తన సీటు త్యాగం చేశారు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజా టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. తన గెలుపు కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆయన పర్యటిస్తున్న నరేంద్ర ప్రాధనిత్యం వహిస్తున్న పొన్నూరు నియోజకవర్గాన్ని ఇప్పటివరకు టచ్ చేయలేదు. 2014 ఎన్నికలకు ముందే వీరిద్దరి మధ్య అంత సఖ్యత లేదు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గా గెలిచారు. సంఘం డైరీ చైర్మన్ విషయం లో రాజా - నరేంద్ర మధ్య పెద్ద ప్రచ్చన్న యుద్ధం జరిగింది .. అప్పుడు నరేంద్ర ఛైర్మన్ అయ్యారు . దీంతో పాత గొడవలు మరింత ముదిరి పాకనపడ్డాయి. ఈ ఎన్నికలలో రాజాకు ఎమ్మెల్యే సీటు దక్కలేదు. దీంతో ఆయన త్వరలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. తన గెలుపు కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్న రాజా ఇంకా పొన్నూరులోకి ఎంటర్ కాలేదు. మరి రాజా సంగతి ఎలా ఉన్నా ? ఆయన గెలుపు కోసం నరేంద్ర పని చేస్తారా ? ఈ ఇద్దరు శత్రువులు చేతులు కలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం జిల్లా రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.