ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మరోసారి విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు కోరారు.ఈ మేరకు ఈనెల 23న బీఎన్ఎస్ సెక్షన్ 35(3)కింద నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా నోటీసుల్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలి. ఈ కేసు దర్యాప్తులో మీ సహకారం అవసరం. కాబట్టి కేసు దర్యాప్తునకు మీరు రావడం ముఖ్యం. తొక్కిసలాట ఘటనలో ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయాలి. అవసరమైతే థియేటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర నుంచి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంటుంది' అని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఇదిలావుండగా తన కుటుంబానికి ధైర్యం చెప్పి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు అల్లు అర్జున్. తన భార్య స్నేహా రెడ్డికి హాగ్ ఇచ్చి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు హీరో అల్లు అర్జున్.విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు అల్లు అర్జున్. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. గంటన్నర నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా? మీడియా ముందు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు?అనుమతి లేకుండా రోడ్ షోలు ఎందుకు చేశారు. వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఆయన పొంతనలేని ఆన్సర్లు చెప్తే థియేటర్ కు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది. డిసెంబరు 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసుస్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ వద్ద వాహన రాకపోకలను నిలిపివేశారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు.