నిర్మలమ్మ ఎఫెక్ట్.. ఇక మీరు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా కొనలేరు?
కొత్త ఖరీదైన కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది కొనుగోలు చేయలేరు. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడానికి లేదా డ్రైవింగ్ వంటి పనుల కోసం కొందరు కారు తీసుకుంటారు. డబ్బులు ఉంటే ఓకే. లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల రాజస్థాన్ జైసల్మేర్‌లో జీఎస్టీ కౌన్సిల్ జరిగింది. ఈ జీఎస్టీ కౌన్సిలోలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాత, సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్టీ రేట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలని భావిస్తారు. కానీ కేంద్రం సెకండ్ కార్ల కొనుగోలుపై రేట్లు పెంచి.. ప్రజలపై భారం వేసింది. అయితే ఇది కేవలం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న వారికే మాత్రమే వర్తిస్తుంది. అంటే మీరు ఆ వ్యాపారి దగ్గర కొనుగోలు చేస్తే మీకు జీఎస్టీ పడుతుంది. అదే మీరు వ్యక్తిగతంగా ఎవరి దగ్గర అయిన కొనుగోలు చేస్తే జీఎస్టీ వర్తించదని కేంద్ర తెలిపింది.
ఆటోక్లేవ్డ్ అయిరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ 50 శాతం కంటే ఎక్కువగా యూజ్ చేస్తే వారికి కూడా జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వీరికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అలాగే ఆహార ఉత్పత్తుల కోసం వాడే ఇన్‌పుట్‌లకు 5 శాతం రాయితీ రేటు పొడిగిస్తారట. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణగ్రహీతల నుంచి పెనాల్టీ వసూలు చేస్తుంటారు. వారిపై ఎలాంటి జీఎస్టీ వర్తించదని కేంద్రమంత్రి తెలిపారు.
పాప్‌కార్న్, చక్కెరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంటే ఇకపై పాప్ కార్న్ కూడా ఖరీదైనదే. జీఎస్టీ సమావేశంలో మొత్తం 148 పదార్థాల రేట్లపై జీఎస్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సమావేశంలో పొగాకు, దుస్తులపై జీఎస్టీ వేశారు. అంటే మీరు తీసుకునే దుస్తులు రూ.1500 ఉంటే 5 శాతం జీఎస్టీ, రూ.1500 నుంచి రూ.10000 ఉంటే 18 శాతం జీఎస్టీ, రూ.10000 కంటే ఎక్కువ ఉంటే 28 జీఎస్టీ రేట్లను నిర్ణయించారు. ఇలా సామాన్య సౌకర్యాలపై జీఎస్టీ పెంచుతుంటే మధ్య తరగతి ప్రజలపైనే మళ్లీ భారం పడనుంది.