తెలంగాణలో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా..? బయట పెట్టిన మహిళా నేత?
పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఘన విజయాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎంజాయ్ చేయలేకపోతోంది. కారణం సంధ్య ధియేటర్ వద్ద జరిగిన సంఘటన .
అయితే బాధిత కుటుంబానికి హీరో, నిర్మాత ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అంతా కూల్ అవుతుండగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో బాధితురాలి తరఫున మాట్లాడారు. స్పందించిన సీఎం ఈ ఘటనకు పూర్తిగా అల్లు అర్జునే బాధ్యుడని ఆరోపించారు.
దీంతో అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నారని, సమాచార లోపంతో అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ మొత్తం రాజకీయ రంగు పులుముకుంది.
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. హీరో అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అనుకోకుండా జరిగిన ఘటనకు ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర అని బండి సంజయ్ ఆరోపించారు. కిషన్‌రెడ్డి కూడా సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యేతో కలిసి సీఎం రేవంత్ చేసిన కుట్ర అని కేంద్రమంత్రి ఆరోపించారు. అల్లు అర్జున్‌కు బీజేపీ నేతలు అండగా నిలిచారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అర్జున్ వ్యాఖ్యలను ఖండించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ మహిళా నేత తిరునగరి జ్యోత్స్న మండిపడ్డారు. అల్లు అర్జున్ కేసు విషయంలో ఉన్న ఇంట్రెస్ట్.. రాష్ట్రంలోని మిగతా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ మరణాలకు బాధ్యులు ఎవరని నిలదీశారు. సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేంత్‌రెడ్డి చర్యలను అభినందించారు. అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల నేత కార్మికుల అంశంపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. అల్లు అర్జున్ మీద చర్చకు సమయం ఉంది కానీ, నేత కార్మికులు, రైతులు, విద్యార్థుల మరణాలపై చర్చకు టైం లేదా అని ప్రశ్నించారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని మండిపడ్డారు.